Saturday, July 25, 2009

Sweets

!! kobbarikaya రవ్వ లడ్డు !!
!! కావలసినవి !!

రవ్వ -- 1 కప్పు

తాజా తెల్లటి కొబ్బరి తురుము -- 2 కప్పులు

పంచదార -- 1 1/2 కప్పులు

జీడిపప్పు -- కిస్మిస్ -- 20

చిటికెడు కుంకుమ పువ్వు

యాలకుల పొడి -- 1/2 టేబల్ స్పూన్

నెయ్యి -- 1.5 కప్పు

!! చేసే పద్ధతి !!

సన్నటి సెగపై రవ్వను 2, 3, నిమిషాలు వేయించాలి.

రెండు స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు , కిస్మిస్ లు వేయించుకోవాలి.

కుంకుమపువ్వును ఒక టీ స్పూన్ పాలలో వేసి

పాలు నారింజరంగుకు మారేవరకు కలియబెట్టి పక్కన వుంచుకోవాలి.

పావుకప్పుకు మించి నీటిని పంచదారలో పోసి వేడి చేసి వడకట్టి

మరో రెండు నిమిషాలు కాచాలి.పాకం బుడగలు వస్తున్నప్పుడు ష్టవ్ కట్టేయాలి.

మందపాటి పాత్రలో నెయ్యివేడి చేసి రవ్వ,కొబ్బరి మిస్రమాన్ని సన్నని సెగపై

5 నుంచి 7 నిమిషాలు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి,యలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్ లు,

కుంకుమపువ్వు,కలిపిన పాలు వేసి కలియబెట్టాలి.

మిశ్రమం చల్లారాక నిమ్మకాయసైజు ఉండలు చేసుకొని

మూత గట్టిగా వున్న డబ్బాలో వుంచాలి.

అప్పుడప్పుడు మూత తీసి ఉండలు క్రిందికీ పైకీ మారుస్తుంటే

నెలరోజులు పాడైపోకుండగా వుంటాయి.

బనాన సర్‌ప్రైజ్ ~~ Banana Surprise
!! కావలసినవి !!

పెద్ద అరటిపళ్ళు ~~ 2

చెక్కర ~~ 300 గ్రా

కొరిన పచ్చి కొబ్బెరకోరు ~~ 1 కప్పు

నెయ్యి ~~ 1/2 కప్పు

ఆరజ్ జ్యూస్ ~~ 1 కప్పు

నేతిలో వేయించిన జీడిపప్పు ~~ 15

!! చేసే విధానం !!

ముందు అరటిపల్లు కట్ చేసి వుంచాలి.(గుజ్జుచేసినా ఒకే)

ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసి

బాగా పొంగువచాక అందులో చెక్కరవేసి

కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి

అందులో కట్ చేసిన అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.

అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి

పక్కన వుంచుకోవాలి.

మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్జ్యూస్ వేసి

బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర,

వేయించి ముక్కలు చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు

వుంచి తీసేయడమే ..ఇది బ్రేడ్కు,ఐస్క్రీంకు చాలా బాగుంటుంది.

ఒక విధంగా హల్వామాదిరిగా టేష్ట్ వస్తుంది.

!! మైసూర్ పాక్ !!
!! కావలసినవి !!

శనగపిండి --1 కప్

పంచదార -- 2 1/2 లేక 3 కప్పులు

ఈలాచి -- 4 ( పొడి చేసుకోవాలి )

నెయ్యి,బట్టర్ -- 1 1/2 కప్

వంట సోడా - 1/2 టేబల్ స్పూన్

!! చేసే విధానం !!

శనగపిండినీ దోరగా వేయించాలి (తక్కువ మంట మీద వేయించాలి)

పంచదారలో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి ।

పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది తీగలా సాగుతున్నట్టు వుండాలి.

ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో వేపిన శనగపిండినీ ,ఈలాచి పొడినీ కలపాలి

ఇప్పుడు కొంచెం నెయ్యినీ ,బట్టర్ నీ ( కరగబెట్టినది ) అందులో వేసి కలపుతూ వుండాలి

ఒక 10 నిమషాలు పాటు దానిని అలాగే కలుపుతూ వుందాలి

అందులో సోడానీ వేసి కలపాలి .ఇప్పుడు గరిటికి అంటుకొకుండా వుండెవరకు కలుపుతూ వుంచాలి

ఒక ప్లెటులో నెయ్యిని రాసి దానిలో ఆ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి అది వేడి వునప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి

మైసూర్ పాక్ తయార్

!! అరటిపండు హల్వా !!
!! కావలసినవి !!

అరటిపండ్లు 5 పెద్దవి

పంచదార 1 కప్

నెయ్యి 3 టేబల్ స్పూన్స్

జీడిపప్పు 15

యాలక్కులు (cardamons) 6

!! చేసే విధానం !!

అరటిపండు తోలుతీసి బాగా గుజ్జుగా mash చెసుకొండి.

మూకుడులో 11/2 స్పూన్ నెయ్యివేసి అందులో

జీడిపప్పుని దోరగా వెయించండి.

తరువాత మళ్ళి కొద్దిగ నెయ్యివేసి ఈ అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా రోష్ట్ చేయండి.

ఇలా 10 నిముషాలు రోష్ట్ (roast for 10 min)

చేసి అందులో పంచదార వేసి మళ్ళి 10 నిముషాలు రోష్ట్ చేయండి.

అందులో యాలక్కుల పౌడర్ వేసి బాగా కలిపి

కొద్దిగా నెయ్యివేసి అందులోనే జీడిపప్పుకూడావేసి

నెయ్యి అంటించిన ప్లేట్ లో ఈ హల్వాని వేసి

diamond shapes లో కట్ చేసుకోండి

!! వేరుశనగ పప్పుచెక్క !!
కావలసినవి !!

వేయించిన వేరుశనగ పప్పు 1 కిలో

బెల్లం 1/3 కిలో

నెయ్యి 6 స్పూన్స్

చేసే విధానం !!

వేరుశనగపప్పు బద్దలుగావుంటే పరవాలేదు కాని గింజలుగానే వుండిపోతే వాటిని రెండుగా విడగొట్టుకోవాలు .

వేరుశనగపప్పుని మీరు ఇంటిలో వేయించ్ఘుకొంటే మరీ మంచిది

బెల్లం సన్నగా తురుముకొని గిన్నెలో వేసి నీళ్ళు పోయాలి

ఈ గిన్నెను పొయ్యిమీదపెట్టి ముదురు గోధుమ రంగు పాకం వచ్చేవరకు కాచాలి.

పాకం వచ్చిందనగానే ఈ పాకంలో వేరుశనగ పప్పు వేసి

అన్నివైపులా సమానంగా వుండెలా కలపాలి.తర్వాతపొయ్యినుండి కిందికి దించాలి.

ఒక పళ్ళెంలో నెయ్యిరాసి అందులో ఈ వేరుశనగపప్పు పాకం పోసి

వేడిగా వున్నప్పుడే పళ్ళెమ్నిండా పరిచి

మీకు అవసరమైన సైజులో కట్ చేసుకొండి. వేరుశనగపప్పుచెక్క (బర్ఫీ) తయార్ :)

!! క్యారెట్ బర్ఫీ !!
కావలసినవి !!

క్యారెట్ 1/2 కేజి

పాలు 1/2 లీటర్

పంచదార 300గ్రా

నెయ్యి50గ్రా

జీడిపప్పు 20గ్రా

తయారు చేసే విధానం !!

క్యారెట్`ను సన్నగా తురమండి .

బాణలిలో క్యారెట్ మరియు పాలు కలిపి ఉడికించండి.

పాలు ఇగిరిపోయాక నెయ్యి వేసి కాసేపు ప్రై చేయండి.

తరువాత పంచదారపోసి మరి కొద్దిసేపు వుడికించండి .

ఇలా వుడికించినప్పుడు పాకం వస్తుంది ఈ పాకం

చిక్కపడిన తరువాత కోవాను పొడిగా చేసి చల్లండి

ఇంకా దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తరువాత దించంది

ఓ ప్లేట్ కి నెయ్యి పూసి అందిలో ఈ క్యారెట్ ముద్దను వేయండి

వీటి మీద జీడిపప్పులు జల్లి ముక్కలుగా కోయండి .

!! చిరోటి రవ కుడుములు !!
!! కావలసినవి !!

చిరోటి రవ 1/4 కేజి ( 1 గ్లాస్ )

మైదా పిండి 2 స్పూన్స్

కొద్దిగ ఉప్పు ( ఉప్పు మంగళకరానికి శ్రేష్టమంటారుగా పెద్దలు
అందుకే శాస్రానికి వేయాలంటే వేయాలి )

నూనె 2 స్పూన్స్

చిటికెడు సోడా

ఇదంతా కొద్దిగ నీళ్ళుపోసి పూరీ పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి.

2 3 గంటలు నానిన తరువాత పూరీలుగా వత్తుకోవాలి

!! పూర్ణానికి కావలసినవి !!

శనగ పప్పు 1 గ్లాసు

బెల్లం 2 గ్లాసులు

వేయించేందుకు తగినంత నూనే

ఎండుకొబ్బెర 3 టేబల్ స్పూన్స్

గసగసాలు 1 1/2 స్పూన్స్

జీడిపప్పు ముక్కలు 3 టేబల్ స్పూన్స్

!! చేయవలసిన విధానం !!

శనగ పప్పు నీళ్ళు వేసి వుడికించి

ఆ నీళ్ళన్ని వంపేసి అందులో చితగొట్టిన బెల్లం పొడిని వేసి

ఒక 2 నిముషాలు వుడక నిచ్చి గ్రైండ్ చేయండి.అందులో కొబ్బెర,

గసగసాలు,నేతిలో వేయించిన జీడి పప్పు వేసి బాగా కలపండి.

ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్ లో తీసివుంచాలి.

పూరీలుగా వత్తుకొన్న వాటిపై ఈ పూర్ణాన్ని పెట్టి చుట్టూ

గోటితో మడతలుగా మడచి నూనేలో దోరగా వేయించడి

పళ్ళెంలో అందంగా పేర్చి, వినాయుకుడి ముందు నేవెధ్యం పెట్టాలి .

తరువాత మీరారగించవచ్చు :) !!!

!! కోవా కజ్జికాయలు !!
!! కావలసినవి !!

పాలు 1 లీటరు

చక్కెర 1/2 కిలో

బెల్లం 1/2 కిలో

కొబ్బెర చిప్పలు నాలుగు

యాలకుల పొడి 1 స్పూన్

!! చేసే విధానం !!

పాలు మరగనిచ్చి చిక్కపడ్డాక చక్కరవేసి గరిటతో కలుపుతూ

దగ్గరగా వచ్చినప్పుడు యాలకుల పోడి వేసి

కోవా అయ్యెంతవరకు కలయ పెడుతూ వుండాలి . కోరివుంచిన కొబ్బెర తురుమును

బెల్లాన్ని రెండూ కలిపి ష్టౌ మీద పెట్టి రెండూ దగ్గరపడి గట్టిపడ్డ తరువాత

చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. ఒక్కొక్క వుండనూ తీసుకొని

దానిమీద తయారు చెసుకొన్న కోవాను పల్చగా చుట్టి పళ్ళెం లో పెట్టుకొని

బాగా ఆరనిచ్చాక పొడి డబ్బా లో వుంచుకోనాలి !!

!! ఢిల్లీ బాదుషా !!

!! కావలసినవి !!

మైదాపిండి 1/2 కేజి

చక్కర 1/2 కేజి

నీళ్ళు 1/2 కప్పు

చిటికెడు సోడా

డాల్డా 1/4 కప్పు

ఏలకుల పొడి 1/2 స్పూన్

నూనే 2 కప్పులు

!! చేసే విధానం !!

మైదా పిండిలో సోడా,నెయ్యి,నీళ్ళు

వేసి 15 నిముషాలు బాగా కలపాలి.

పిండిని వడపిండిలా కలుపుకోవాల

వాటిని వడలమాదిరిగా చేసుకొని

వేడి చేసిన నూనేలో వేయించండి.

అరకప్పు నీళ్ళలో 1/2 చక్కర వేసి

చక్కర కరిగెంతవరకు వుంచండి.

లైట్ గా తీగపాకం వచ్చెంతవరకు

పెడితే బాదుషాలపై చెక్కర నిలబడుతుంది

ఈ పాకంలో వేయించిన బాదూషాలు వేసి

15 నిముషాల తరువాత తీసి ప్లేట్ లో వుంచండి

కన్నులకు ఇంపుగా కనిపించే బాదూషాలు రెడీ :) !!


!! సెనగ పిండి లడ్డు !!

!! కావలసినవి !!

సెనగపిండి 150 gms

పంచదార 100 gms

కోవా 50 gms

నెయ్యి 60 gms

ఏలకులు 10

!! చేసే విధానం !!

బాణలి వేడి చేసి కొద్దిగానెయ్యి వేసి

సెనగపిండిని కమ్మని వాసన వచ్చేవరకునిదానంగా వేయించాలి

పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి

కోవాను కూడా కొద్దిగావేపి సెనగపిండిపంచదారపొడి

అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి

చేతికి నెయ్యి రాసుకొని వుండలు కట్టితే

వుండ విరిగిపోకుండగా గట్టిగా వుంటుంది :)


!! శనగపప్పు బొబ్బట్లు !!

!! కావలసినవి !!

శనగపప్పు 500 gm

బెల్లం 500 gm

మైదాపిండి 250 gm

నూనె అర కప్పు

నెయ్యి అరకప్పు

నెయ్యి కాస్త ఎక్కువైనా కమ్మగానే వుంటుంది.

యలకుల పొడి 1 టేబల్ స్పూన్

సోంఫు పొడి 3 టేబల్ స్పూన్స్

!! చేసే విధానం !!

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి

తర్వాత నీళ్ళువార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి

చివరలో యాలకులు,సోంఫు పొడులు కలపాలి

ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి

తరువాత మైదాపిండిలో కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి

ఈ పిండిముద్దను కనీసం ఒక గంట అయినా నాననీయాలి

నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని

చేతితో వెడల్పు చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి

నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద

పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి

పొయ్యి మీద పెనం వేడి చేసి ఈ బొబ్బట్టును నేతితో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి

వేడి వేడి బొబ్బట్టుపైవేడి వేడి గా కాచిన నెయ్యి వేసుకొని తినండి చాలా రుచిగా వుంటాయి

పాలు కావలసిన వారు పాలు వేడి చేసి బొబ్బట్లపై వేసుకొని తింటే...

వావ్.....భలేరుచిగా వున్నాయి :) మరి మీరూ త్వరపడండి.

వినాయక చవితినాడు నాయకునికి ఆరగింపు పెట్టండి మీరూ తరించండి :)!!


!!! క్యారట్ హల్వా !!!

!!! కావలసినవి !!!

తురిమిన క్యారట్ 250 gm

చక్కెర 100 gm

నెయ్యి 50 gm

జీడిపలుకులు 10

యాలకుల పొడి 1 tsp

పాలు 1/2 lit

!!! చేసే విధానం !!!

ముందుగా క్యారట్,చక్కెర కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి పొయ్యిమీద పెట్టాలి.

ఆ తర్వాత పాలు పోసి ఉడికించాలి.

కాస్త దగ్గర పడ్డాక జీడిపప్పుముక్కలు,యాలకుల పొడి వేసి కలపాలి.

పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక నెయ్యివేసి కలిపి దించేయాలి.

!!! సున్నుండలు !!!

!!! కావలసినవి !!!

మినప్పప్పు 100 gms

పంచదార 100 gms

ఏలకులు 5

నెయ్యి 50 gms

!!! చేసే విధానం !!!

ముందుగా మినప్పప్పును ఖాళీ బాణలిలో కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా

వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.

పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు మినప్పప్పు పొడి, పంచదార పొడి రెండింటిటిని బాగా కలపాలి.

కొద్ది కొద్దిగా తీసుకుని కరిగించిన నెయ్యి పోసి ఉండలుగా కట్టి పెట్టుకోవాలి.

ఇవి మాంచి పుష్టికరమైనవి.

ఈ విధంగానే మినుములతో కూడా చేస్తారు .

!!! రవ్వ లడ్డు !!!

!!! కావలసినవి !!!

బొంబాయి రవ్వ 250 gms

పంచదార 250 gms

ఎండు కొబ్బరి పొడి 50 gms

ఏలకులు 4

జీడిపప్పు 10

కిస్మిస్ 10

నెయ్యి 50 gms

పాలు 100 ml

!!! చేసే విధానం !!!

ముందుగా నెయ్యి కరిగించి జీడిపప్పు,కిస్మిస్ కొద్దిగా వేయించి

అందులోనే రవ్వను కమ్మని వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.

పంచదార ఏలకులు కలిపి మెత్తగాపొడి చేసుకోవాలి.

వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,

అన్నిబాగాకలిపికొద్దికొద్దిగా పాలు చల్లుకుంటూ ఉందలుగ చేసి పెట్టుకోవాలి.

ఇవి నెలరోజులువరకు నిలువ ఉంటాయి. త్వరగా చేయొచ్చు కూడా

మీరూ త్వరపడండి.... :)

!!! నువ్వుల లడ్డు !!!

!!!కావలసినవి !!!

తెల్ల నువ్వులు 250 gm

బెల్లం 250 gm

నెయ్యి 2 tsp

ఏలకులు 4

!!! చేసే విధానం !!!

బెల్లం కరిగించి వడకట్టుకోవాలి

నువ్వులు ఖాలీ బాణలిలో దోరగా వేయించాలి.

నువ్వుపప్పు నొట్లో వేసుకుంటే గుల్ల విచ్చినట్టు ఉండాలి.

బెల్లం ముదురు పాకం చేయాలి.

ఒకచిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి రెందు చుక్కలు పాకం అందులో వేస్తే అది వెంటనె ఉండకట్టాలి.

ఆ ఉండను నేలకేసి కొడితే విరగదు.

ఇప్పుడు నెయ్యి, ఏలకుల పొడి నువ్వులు అన్నీ వేసి బాగా కలిపి దించి.

నెయ్యి రాసిన పళ్ళెంలో చిన్న గరిటతో ఈ నువ్వులపాకాన్ని కొద్ది కొద్దిగా వేసి

చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేడి మీదనే ఉండలుగ చేసుకోవాలి.

అరగంట ఆరిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోడమే.

నాగుల చవితి నాడు చేసే నైవేద్యం !!!

!!! జాంగ్రీ !!!

!!! కావలసినవి !!!

మినప్పప్పు 250 gm

బియ్యం గుప్పెడు

పంచదార 1/2 kg

మిఠాయిరంగు చిటికెడు

నెయ్యి లేక నూనె వేయించడానికి

!!! చేసే విధానం !!!

మినప్పప్పును శుభ్రం చేసి బియ్యం కలిపి నీళ్ళు పోసి 4 గంటలు నాననివ్వాలి.

తర్వాత ఈ పప్పును కాటుకలాగా మెత్తగా రుబ్బుకోవాలి.

పంచదారలో కప్పుడు నీళ్ళు పోసి జిగురుపాకం చేసి మిఠాయిరంగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఒక మందపాటి గుడ్డకు రంధ్రం చేసి ,అంచులు కుట్టి, అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలు కలిపి

మూటలాగా పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.

ఎర్రగా కాలినతర్వాత తీసి పాకంలో వేయాలి.

అలా అన్ని చేసుకుని రెండుగంటలు పాకంలో నాననిస్తే, జాంగ్రీలు గుల్ల విచ్చి పాకం బాగా

పీలుచుకుని మృదువుగా ఉంటాయి.

జాంగ్రీ ,లేదా జిలేబీలు ,చేయడానికి ప్లాస్టిక్ బాటిల్ వంటిది దొరుకుతాయి.

అవి కూడా ఉపయోగించుకోవచ్చు...

!!! పెసర బొబ్బట్లు !!!

!!! కావలసినవి !!!

పెసరపప్పు 250 gm

పంచదార 250 gm

రవ్వ 250 gm

మైదా 100 gm

యాలకుల పొడి 1 tsp

నెయ్యి అరకప్పు

!!! చేసే విధానం !!!

పెసరపప్పును శుభ్రపరచుకొని గంట సేపు నీటిలో నాననివ్వాలి.

నానిన పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి.

ఉడికిన ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగ

పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి.

ఉడుకుతుండగా అందులో కొంచెం నెయ్యి,యాలకుల పొడి వేసి గట్టి పడేవరకు వుంచాలి.

తర్వత దించేయాలి.

చల్లారాక చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.

మైదా, రవ్వ కలిపి నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి.

ఒక పాలిధిన్ పేపర్‌కు నూనె రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి

వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ ముద్దను పెట్టి అంచులు మూసి

నూనె చేతితో చపాతీలా వత్తుకుని వేడి పెనంపై నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి.

ఇవి వేడి వేడిగా తింటే భలే రుచి :)


!!! చలిమిడి !!!

!!! కావలసినవి !!!

బియ్యం ఒక కప్పు

బెల్లం అర కప్పు

పచ్చికొబ్బరి పావు చిప్ప

గసగసాలు రెండు చెంచాలు

యాలకులు మూడు

నెయ్యి నాలుగు చెంచాలు

!!! చేసే విధానం !!!

ఒక రోజు ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం జల్లెడలో పోసి వడకట్టి

రోట్లో లేదా గ్రైండర్లో పొడి చేసుకుని జల్లించి తడి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి.

పిండి ఆరిపోకూడదు. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

బాణలిలో నెయ్యి వేడి చేసి కొబ్బరిముక్కలు ఎర్రగా వేయించి పక్కన ఉంచి, గసగసాలు

కూడా వేయించి తీసుకోవాలి.యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం తురిమి,

పావు కప్పు నీరు పోసి ఉడికించి, మరీ లేత కాకుండా మరీ ముదురు పాకం కాకుండా

చేసి యాలకుల పొడి, నెయ్యి కలిపి క్రిందకు దించి కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ

గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ చివరగా కొబ్బరిముక్క్లలు,గసగసాలు కూడా

కలిపి మూతపెట్టి ఉంచాలి. చలిమిడి రెడీ

!!! డబల్ కా మీటా !!!

!!! కావలసినవి !!!

బ్రెడ్ 8 స్లైసులు

చక్కెర 150 gm

పాలు 1/2 lit

యాలకుల పొడి 2tsp

కుంకుమపువ్వు చిటికెడు
లేదా కేసర్ రంగు

బాదాం5

జీడిపప్పు 5

కిస్‍మిస్ 5

నెయ్యి బ్రెడ్ స్లైసులు వేయించడానికి

!!! చేసే విధానం !!!

ముందుగా బ్రెడ్ స్లైసులను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

వాటిని నెయ్యిలోకాని రిఫైండ్ నూనెలో కాని ఎర్రగా వేయించాలి.

పాలు ,చక్కెర, కుంకుమపువ్వు కలిపిమరిగించి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి.

బ్రెడ్ ముక్కలను ఒక వెడల్పాటి పళ్ళెం‍లో పరిచివాటిపై ఈ వేడి చిక్కటి పాలు సమనంగా పోయాలి.

బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకుంటాయి.

పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపపు, కిస్‍మిస్ చల్లాలి.

ఇది వేడిగా కాని చల్లగా కాని వడ్డించాలి.మరి మీరూ మొదలెట్టండి :)


!!! పాకం గారెలు !!!

కావలసినవి

పొట్టుమినపప్పు 50గ్రా

బెల్లం 1 కి

రిపైండ్ ఆయిల్ తగినంత

ఉప్పు తగినంత

నెయ్యి 50 గ్రా

యాలకులు 5

తయార్ చేసే విధం

పొట్టుమినపప్పు నాలుగుగంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి

పొట్టువచ్చేవరకుచేతితో రుద్ది నీళ్ళతో కడగాలి .

ఆ తరువాత ఈ పప్పును గ్రైండర్ లో మరీమెత్తగాకాకుండ

గ్రైండ్ చేసి తరిగిన బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి

లేతపాకం వచ్చేవరకువేడి చేయాలి .

ఇప్పుడు ఒక మూకుడులో నూనెపోసి వేడికాగానే

మినపప్పు ముద్దను తడి అరచేతిపైన లేదా అరటాకుపైన గాని

అద్ద నూనెలో వేయాలి .వాటిని ఎర్రగా వేయించి ,

తీగపాకంలో ముంచి బాగా నాన నివ్వండి .

నోరూరించే పాకం గారెలు రెడి :)