Saturday, July 25, 2009

పచళ్ళు

!! సెనగపప్పు పచ్చడి !!
!! కావలసినవి !!

చనగపప్పు (Gramdal) -- 1/2 కప్పు

మినపప్పు --- 1 1/2 టేబల్ స్పూన్స్

ఆవాలు --- 1 టేబల్ స్పూన్

ఎండి మిర్చి --- 4

పచ్చి మిర్చి --- 2

బెల్లం ( jaggery ) 1/2 -- టేబల్ స్పూన్

ఉప్పు --- పసుపు --- రుచికి తగినంత

చిక్కటి చింతపండు రసం --- 2 టేబల్ స్పూన్స్

పచ్చి కొబ్బర ( లేక ఎండుకొబ్బర ) --- 1/4 కప్పు

నునె --- పోపు కు తగినంత ( తాలింపు )

కర్వేపాకు ఒక రెబ్బ

ఇంగువ --- 2 1/4 టీ స్పూన్

పోపు సామాగ్రి ఎండుమిర్చితోపాటు --- 1 టేబల్ స్పూన్

!! తాయారు చేసేవిధం !!

ముందు చనగ పప్పు,ఆవాలు,మినపప్పు,ఎండుమిర్చి,ఎండు కొబ్బర,

అన్నీ నూనె లేకుండగా దోరగా విడి విడి గా బాణలి లో వేయించుకోవాలి.

తర్వాత వేయించిన వాటిని , పచ్చిమిర్చి , పచ్చికొబ్బర , ఉప్పు ,పసుపు ,

బెల్లం , చింతపండు రసం , అన్నీ గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పచ్చడి పై కర్వేపాకుతో , ఇంగువ వేసి పోపు పెట్టాలి.

వేడి వేడి అన్నానికి పచ్చి నునె వేసుకొని పచ్చడితో తింటే....ఆహా ఏమి రుచి...

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!! వంకాయ పులుసు పచ్చడి !!

!! కావలసినవి !!

వంకాయలు --- 2

పసుపు --- చిటికెడు

పల్చటి చింతపండు రసం --- 4 టేబల్ స్పూన్స్

బెల్లం పొడి --- 1/4 ---కప్పు

ఆవపొడి --- 1/2 టేబల్ స్పూన్

ఇంగువ --- కొద్దిగా

సోంపు --- 1 టీ స్పూన్

మినపప్పు --- 1 టీ స్పూన్

ఆవాలు --- 1/2 టీ స్పూన్

ఎండు మిర్చి --- 3

పచ్చి మిర్చి --- 2

కరేపాకు --- ఒక రెబ్బ

నునె --- 25 గ్రా

ఉప్పు --- రుచికి తగినంత

!! తయారు చేసేవిధం !!

వంకాయలు కడిగి తుడిచి నునె రాసి కాల్చుకొవాలి.

తర్వాత వాటిని వలిచి ముద్దచేసి వుంచుకోవాలి.

దీనిలో చింతపండు రసం , ఉప్పు , పసుపు , బెల్లం , ఆవపొడి , వేయాలి.

ఇప్పుడు మిగిలిన దినుసులు ( ఆవాలు,మినపప్పు,సోంపు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి,

కర్వేపాకు ) అన్నీ వేసి తాలింపు పెట్టి వంకాయలో కలుపుకొవడమే.

కావాలంటే కాచి చల్లారిన నీరు కొంచం పొసి పల్చగా చెసుకొవచ్చు.

కోత్తిమిర తురుము వేసుకొన్నా కమ్మగా వుంటుంది మరి మీరు తయారా ??? :)

!! పచ్చి ఉసిరికాయ పచ్చడి !!

!! కావలసిన పదార్ధాలు !!

చక్కటి ఉసిరికాయలు ~~ 15

కొత్తిమిరి ~~ 1 కట్ట

పచ్చిమిరపకాయలు ~~ 6

ఎండు మిరపకాయలు ~~ 4

ఆవాలు ~ 1/3 టీస్పూన్

ఇంగువ ~~ 2 చిటికెలు

!! చేసే విధానం !!

ముందు ఉసిరికాయలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి

ఉడికిన ఉసిరికాయలలోంచి పిక్కలు తీసి పారేసి ముద్దగా చేసుకోవాలి

పచ్చిమిరపకాయలు(మనం తినే కారాన్ని అనుసరించి)కొత్తిమిరీ కలిపి మిక్సీలో ముద్ద చేసుకోవాలి

ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి

అలా తయారయిన ముద్దకు ఎండు మిరపా,ఆవాలు,ఇంగువా పోపు వేసి

తగినంత ఉప్పువేసుకోవాలి


!! బెండకాయ పచ్చడి !!



(మీకిది తెలుసా...పచ్చి బెండకాయలు
తెల్లారి పరకడుపున తింటే మలబద్దకం వున్న వాళ్ళకి
ఈజిగా జీర్ణం అవుతుందని గట్టిగా చెప్పగలను.)

!! కావలసినవి !!

బెండకాయలు -- 1/4 కిలో

డ్రై చిల్లీ --6

మినపప్పు -- 1,1/2 టేబల్ స్పూన్స్

ఆవాలు -- 1 టేబల్ స్పూన్

మెంతులు 1/4 టే స్పూన్

ఉప్పు తగినంత

ఇంగువ -- 2 చిటికెడు

చింతపండు జ్యూస్ -- 3 టేబల్ స్పూన్స్

నూనె -- 1 గరిటేడు

(పోపు గింజలు)

ఆవాలు,జీర.మినపప్పు,డ్రై చిల్లి--2

ఇంగువ కావాలంటే (చనగపప్పు)కొద్దిగ

అన్నీ...2 టేబల్ స్పూన్స్

కరేపాక్ ఒక రెబ్బ

::: చేసే విధానం :::

ముందు బెండకాయల్ని శుభ్రంగా కడిగి

గుడ్డతో తుడిచి కట్ చేసి వుంచండి

ష్టవ్ పై మూకుడు పెట్టు అందులో నూనె వేసి

సన్నటి సెగపై మినపప్పు,మెంతులు,ఆవాలు,డ్రై చిల్లీ

అన్నీ కొద్దిగ నూనె లో విడివిడిగా దోరగా వేయించి తీయండి.

మూకుడు లో మళ్ళి కొద్దిగ నూనె వేసి అందులో బెండకాయలు వేసి

బాగా వేగనివ్వాలి.

గ్రైండర్ లో వేయించిన మినపప్పు,ఆవాలు,మెంతులు,డ్రై చిల్లీ,

వేగనిచ్చిన బెండకాయలూ, చింతపండు జ్యూస్,ఉప్పు,

అన్నీ బాగా మెత్తగా గ్రైడ్ చేసి తీసి చిన్న పాత్ర(vessel)

ల్లో వేసి మళ్ళి మూకుడులో నూనె వేసి అందులో పోపుగింజలన్నీ వేసి

దోరగా వేగ నిచ్చి డ్రై చిల్లి,కరేపాక్,వేసి ఆ పోపు ఈ పచ్చడిలో

కలపాలి

!!! పుదిన పచ్చడి !!!
!! కావలసిన పధార్థాలు !!

పుడిన 1 కట్ట

ఎండుకొబ్బెర కోరు కాని

పచ్చికొబ్బెర కోరు కాని 4 టేబల్‌స్పూన్

చింతపండు 50 గ్రా

చనగపప్పు 1 టేబల్‌స్పూన్

ఉద్దిపప్పు 11/2 టేబల్‌స్పూన్స్

మెంతులు 15 గింజలు

పచ్చిమిర్చి 6

నూనే 3 టేబల్‌స్పూన్స్

ఉప్పు రుచికి తగినంత

!! చేసే విధానం !!

ముందుగ పుదిన బాగా కడిగి వుంచుకోండి.

మూకుడులో కాస్త నునె వేసి,చనగపప్పు,ఉద్దిపప్పు,

మెంతులు దోరగా వేయించుకొని, ఎండుకొబ్బెర,చింతపండు,

పచ్చిమిర్చి విడి విడిగా వేయించుకొని,

ఉప్పు,పుదిన తక్కినవన్నీ వేసి అన్నీ బాగా గ్రైండ్ చేసి

పైన పోపు వేయండి. ఇది వేడి వేడి అన్నానికే గాక, దోసకి,

మైసూర్ బజ్జి,లాంటివన్నిటికీ చాలా బాగుంటుంది.


!! వంకాయ పచ్చడి !!
!! కావలసినవి !!

వంకాయలు పొడువ్వి 2(long, purple colour)వి

పచ్చిమిర్చి 6

టోమాటో 3

2 టెబల్ స్పూన్ చితపండు జ్యూస్

ఉప్పు

11/2 గరిటేడు నూనె

!!తాలింపుకు కావలసినవి !!

ఆవాలు 1 టీస్పూన్

జిలకర్ర 1/2 టీస్పూన్

శనగపప్పు 1/2 టీస్పూన్

మినపప్పు 1/2 టీస్పూన్

ఎండుమిర్చి 4

ఇంగువ చిటికెడు

!! చేసే విధానం !!

పాన్లో ఒక అర గరిటెడు నూనె వేసి

నూనె కాగాక అందులో వంకాయల్ని

తరిగి వేసి పచ్చిమిర్చి, టోమాటో

వేసి బాగా వుడికించి

చింతపండు జ్యుస్ వేసి ఉప్పువేసి

గ్రైండ్ చేసి వుంచండి

పాన్లో నూనె వేసి కాగాక

ఆవాలు,మినపప్పు,శనగపప్పు,

జిలకర్ర,ఇంగువ వేసి అవి చిటపట

అన్నతరువాత ఎండుమిర్చివేసి పచ్చడిలో కలపండి
ఇది అన్నానికీ,దోసలకీ, చాలాబాగావుంటుంది.

!! గోంగూర పచ్చడి !!
ఈ పచ్చడి 1నెలరోజులు fridge లో వుంచితే
పాడుకాకుండగా వుంటుంది :)

!!కావలసినవి!!

గోంగూర 2 కట్టలు

వెల్లుల్లి పాయలు 20 పాయలు

పచ్చిమిరపకాయలు 15

(కారం ఎక్కువగా కావాలంటే ఒక5వేసుకోవచ్చు)

రుచికి ఉప్పు

ఆనియన్ 1

ఆవాలు 1 టీస్పూన్

ఎండు మిర్చి 6

నూనే 1/4కప్పు

!! చేసే విధానం !!

గోంగూరని బాగా కడిగి

నీళ్ళు లేకుండగా గుడ్డతో వత్తి

నీళ్ళన్ని తుడవాలి.

తరువాత పొట్టుతీసివుంచిన

వెల్లుల్లిపాయల్ని ఒకటికి

నాలుగు ముక్కలుగా తరిగి వుంచుకోండి

ష్టవ్ పై మూకుడుంచి అందులో

కొద్దిగ నూనె పోసి ఈ ఆకు కూరని అందులో వేసి

అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు

పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయి

బాగా వేగేంతవరకు వుడికించాలి.

ఇప్పుడు వుడికిన దాన్ని

మెత్తగా గ్రైండ్ చేసుకొండి.

పాన్ లో గరిటెడు నూనే వేసి

కాగాక అందులో ఆవాలు ఎండు మిర్చి

ఇంకా మిగిలిన వెల్లుల్లిపాయలు వేసి

అవి దోరగా వేగాక తీసి ఈ గ్రైండ్

చేసిన పచ్చడిలో వేయాలి . అందులోనే

ఆనియన్ ముక్కలు కలిపి వేడి వేడి అన్నం తో తింటే వావ్
భలేరుచి :)

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!!! అల్లం పచ్చడి !!!

!! కావలసినవి !!

శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 2 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

చింతపండు - చిన్న నిమ్మకాయంత

అల్లం - 3 inch piece

ఉప్పు - సరిపడినంత

పచ్చిమిరపకాయలు - 11

బెల్లం - 1 1/2 cubes

నునె - 3 tbl spoon

అల్లం పచ్చడి తయారు చేసే విధానం

పాన్ లో నునె వేసి అందులో శనగపప్పు , మినపప్పు ,

దనియాలు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేయించి ఆపేయ్యాలి.

ఇప్పుడు అది చల్లరబెట్టి అందులో చింతపండు , ఉప్పు , బెల్లం వేసి

అందులొ కొంచెం నిళ్ళూ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి

ఇది దోసా , ఉప్మా , సమోసా . ఇలాంటి వాటికి చాలా బావుంటుంది
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!!! దోసకాయ పచ్చడి !!!

దోసకాయలు -- 2

కోత్తమీర కట్ట -- 2 ( చిన్నవైతే 2 పెద్దవైతే 1 చాలు )

గ్రీన్ ఛిల్లీ -- 4

ఎండుమిర్చి -- 6

మెంతులు ఓ -- 20 గింజలు

ఆవాలు -- 1 టేబుల్ స్పూన్

మినపప్పు - - 2 టేబుల్ స్పూన్స్

జీర -- 1/2 స్పూన్

ధనియాలు -- 1/2 స్పూన్

నూనె తగినంత

చింతపండు నిమ్మకాయంత

విడిగా పోపు గింజలు

ఇంగువ , పసుపు , తగినంత ఉప్పు .

!!!!! చేయు విధానం !!!!!

ముందుగా ఒక దోసకాయని సన్నగా తరుకోని వుంచండి.

చింతపండు నానబెట్టి గుజ్జుతీసి వుంచండి .

మూకుడు వేడి చేసి అందులో ఆవాలు , మెంతులు , మినపప్పు , ధనియాలు , ఎండుమిర్చి,

అన్నీ కొద్ది నూనెలో దోరగా వేయించుకొండి .

రెండో దోసకాయను మీకు ఏసైజు కావాలో ఆ సైజు లో తరుక్కోని

గ్రైడర్లో వేయించిన గింజలు, రెండో దోసకాయను

చింతపండు , కోత్తిమీర తరుగు , గ్రీంచిల్లీ , ఉప్పు

పసుపు , అన్నీ వేసి గ్రైండ్ చేసి అందులోనే ఎండుమిర్చి ఇంగువతో పోపు వేసి ఈ సన్నగా తరిగిన

దోసకాయను అందులో కలిపాలి.