!! కావలసినవి !!
చిరోటి రవ -- 1 కప్పు
వాంగిబాత్ పౌడర్ -- 3 స్పూన్స్
వంకాయలు -- 5
పోటాటో -- చిన్నవి -- 2
టోమాటోస్ -- 3
గ్రీన్ చిల్లీ -- పెద్దవి -- 2
కరేపాక్ ఒక రెబ్బ
కొత్తమిర తురుము -- 1 -- టేబల్ స్పూన్
అన్నీ కలిపిన పోపుగింజలు -- 1 టేబల్ స్పూన్
పచ్చికొబ్బెర -- 1/4 కప్
వేయించిన జీడిపప్పు ముక్కలు 20
నీళ్ళు -- 2 -- కప్పులు
ఉప్పు -- తగినంత
నెయ్యి -- 2 --టేబల్ స్పూన్స్
నూనె -- 1/4 కప్
కరేపాక్ -- 2 -- రెబ్బలు
!! చేసే విధానం !!
చిరోటి రవ కొద్దిగ నెయ్యివేసి దోరగా వేయించుకోవాలి.
వంకాయలు,పోటాటో,టోమాటో,లు మీకు కావలసిన షేపులో కట్ చెసి
నీళ్ళల్లో ఉప్పువేసి వుంచండి.
పచ్చిమిర్చి,కరేపాక్, కట్ చేసి వుంచుకొండి.
ఇప్పుడు ష్టవ్ పై బాణలి (Wok) వుంచి అందులో ఒక గరిటె నూనె వేసి
నూనె కాగాక అందులో పోపుగింజలు కరేపాకు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత
అందులో పచ్చిమిర్చి,కరేపాక్ వేసి,అందులోనే తరిగిన వంకాయలు,పోటాటో,
టోమాటో లు వేసి అవికాస్త వుడికాక వాటిపై వాంగిబాత్ పౌడర్ వేసి
బాగా కలయబెట్టి నీళ్ళు పోసి ఉప్పువేసి నీళ్ళు బాగా తెర్లేవరకు
వుంచి అందులో రవ వేసి బాగా కలపాలి వుంటలు కట్టకుండగా కలపాలి.
రవ గట్టిగా పొడిపోడిగా మౄదువుగా రావాలి అందులోకి
మిగిలిన నెయ్యి, కొత్తమిర, జీడిపప్పు,వేసి సర్వ్ చేయడమే
ఘుమఘుమలాడే రవ వాంగీబాత్ తయార్ :)
!! వాంగిబాత్ పౌడర్ చేసే విధానం !!
చెన్నాదాల్ -- 1 కప్
మినపప్పు -- (Urad dal) --1 కప్
ధనియ -- 3/4 - కప్
డ్రై చిల్లీ -- 25 గ్రా (కారం తగినంత)
లవంగాలు -- 3 ( clove )
చెక్క (Cinnamon stick) 1
ఎండు కొబ్బెర --(dessicated coconut)-- 1/2 కప్పు
జీడిపప్పువేయించినవి -- 4
!! చేసే విధానం !!
ముందు మూకుడు ష్టవ్ పై వేడి చేసి అందులో
విడి విడిగా అన్నీ దోరగా వేయించుకోవాలి
కొబ్బెర కొద్దిగ వేడి చేస్తే చాలు
తక్కిన వన్నీ దోరగా light golden brown వేయించి
అన్నీ గ్రైండర్లో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి.
!! స్పైసీ దోసె !! !! కావలిసిన పధార్ధాలు !!
బియ్యం -100గ్రా
అల్లం మిర్చి పేస్టు - 1/2 చెంచా
ఉల్లి ముక్కలు - 1కప్ఫు
కారం - 1/4 చెంచా
మైదా పిండి -50గ్రా
పుల్ల మజ్జిగ - 1 గ్లాసు
ఉప్పు - సరిపడ
పసుపు -చిటికెడు
!! తయారు చేయు విధానం!!
ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లి ముక్కలు, ఉప్పు , కారం,
పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి
కాలిన పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి
రెండు వైపులా కాల్చి వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లపు చెట్నిలతో సర్వ్ చెయ్యాలి
మీకు నచ్చితే మీరూ చేసుకోండి :)
!! ఇడ్లి పిండితో బజ్జిలు !!
ఇడ్లిలు పోసి మిగిలిన పిండిలో కొద్దిగ మైదా,
తరిగిన ఉల్లిపాయలు, 4పచ్చిమిర్చి,
కాస్త ఉప్పు,కరేపాక్, కోత్తిమిర. వేసి బాగా కలిపి
ష్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి కాగిన తరువాత
బజ్జీలుగా వేసి దోరగా వేయించిన
తరువాత తీసి టోమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి :)
!! సాగు - పూరీ !! !! పూరీకి కావలసినవి !!
2 కప్స్ వీట్ ఫ్లోర్ {wheat flour}
2 టీస్పూన్స్ ఆయిల్
నీల్లు తగినంత
ఉప్పు రుచికి
deep fry కి కావలసిన నూనె
!! పూరీ చేసే విధానం !!
ఉప్పు,నూనే,నీళ్ళు, పూరీ పిండిలో కలిపి చపాతిపిండిలా గట్టిగా కలిపి వుంచుకోవాలి.
ఒక గంట తరువాత పూరీలను రౌండ్ గా వత్తుకొని కాగిన నూనేలో deep fry చేసి
light brown వచ్చాక తీసి సాగుతో సర్వ్ చేయండి.
!! సాగు కావలసినవి !!
11/2 కప్స్ mixed vegetables
{green beans, carrots,potatoes, and peas}
1 ఆనియన్ chopped
1 టోమాటో chopped
1/2 టీస్పూన్ ఆవాలు
3 టీస్పూన్స్ ఆయిల్
1 టీస్పూన్ chopped కోత్తమిరfor garnish
తగినంత ఉప్పు.
!! మసాల కావలసినవి !!
1/2కప్ grated coconut
1 స్మాల్ ఆనియన్ cut into pieces
1 టీస్పూన్ జిలకర్ర
2 టీస్పూన్స్ ధనియాలు
2 టీస్పూన్స్ గసగసాలు{poppy seeds}
1 టేబల్ స్పూన్ పుట్నాలు ( వేయించిన పుట్నాలు)
(whole split peas)
5 గ్రీన్ చిల్లి
1టీస్పూన్ tamarind juice
1cinnamon stick,crushed
3cloves
1/4 టీ స్పూన్ పసుపు
1 టేబల్ స్పూన్ chopped corinader leaves
!! సాగు చేసే విధానం !!
ముందు మసాల కావలసినదంతా
కొద్దిగ నీళ్ళు పోసి
మెత్తగా pasteచేసి వుంచండి.
ష్టవ్ పై pan వుంచి అందులో
3 టీస్పూన్స్ ఆయిల్ వేసి అందులో
ఆవాలు, వేసి అవి చిటపట అన్న తరువాత
ఆనియన్ వేసి 2minutesతరువాత
టోమాటో వేసి అది కాస్త వుడికినతరువాత
తరిగివుంచిన కోరగాయలన్నీ అందులోవేసి
5-10minutes వుడికించండి.
ఈ గ్రైండ్ చేసిన మసాల వుడికిన
కూరగాయలలో వేసి, ఉప్పు,పసుపు,
11/2 గ్లాస్ నీళ్ళు కూడా ఆడ్ చేసి
10-12 minutesవుడికించండి.
chopped coriander leaves.తో
చక్కగా decorateచేసి
అందరికీ పూరీ సాగుతో
సర్వ్ చేయండి :)
!! దిబ్బరొట్టె !!!! కావలసినవి !!
మినప్పప్పు 250 గ్రాం
బియ్యపురవ్వ 150 గ్రాం
ఉప్పు సరిపడ
నూనె 1/2 కప్పు
!! చేసే విధానము !!
మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి
మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో
బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే
కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి
అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని
వేరుశనగపప్పు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. బ్రెడ్ ఎలా ఉంటుందో
దిబ్బరొట్టె అంత మందంగా ఉంటుంది.
!! పుల్లట్టు !! !! కావలసినవి !!
బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితో
కాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది :)
!! రవ దోశ !! !! కావలసినవి !!
గోధుమ రవ్వ 1కప్పు
మైదా 1/4 కప్పు
బియ్యంపిండి 1/4
పెరుగు 1 కప్పు
కరేపాక్,కొత్తమిర తగినంత
పచ్చి మెరపకాయలు 3{సన్నగా తరిగినవి}
ఆనియన్ 2{సన్నగా తరిగినవి}
జిలకర్ర 1/2 టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె దోశలకు తగినంత
!! తయార్ చేసే విధానం !!
రవ,బియ్యం పిండి, మైద,పెరుగు,మిర్చి కరేపాక్,కొత్తమిర,ఉప్పు,ఆనియన్,జిలకర్ర,
అన్నీ తగినంత నీళ్ళుపోసి కలిపి కాస్త పల్చగా వుండాలి.
పెన్నం వేడిచేసాక దోశ పల్చగా వేసి
రెండువైపులా బాగా కల్చి, కొబ్బెర చట్ని తొ కాని మాంగో పికల్ తొ కాని ఆరగించారంటే చాలాబాగుంటాయి :)
!! మైసూర్ మసాలా దోసె !! !! కావలసినవి !!
మినప్పప్పు 2 కప్పులు
శనగపప్పు 2 కప్పులు
బియ్యం 1/4 కప్ప్పు
మెంతులు 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
ఎండుమిర్చి తగినన్ని
!! మసాలా దినుసులు !!
పొటాటో 1/2కిలో
పసుపు 1/4 టీస్పూన్
ఉడికించిన బఠాణీలు 1/2 కప్పు
పచ్చిమిర్చి 3
అల్లం చిన్న ముక్క
ఆవాలు 1/4 టీస్పూన్
మినప్ప్పప్పు 1 టీస్పూన్
శనగపప్పు 1 టీస్పూన్
కరివేపాకు 1 రెబ్బ
నూనె 2టీ స్పూన్స్
!! చేసే విధానం !!
పొటాటో ముందే వుడికించి పొట్టుతీసి చేత్తో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠానీలు,తగినంత
ఉప్పు వేసి పొటాటోను అందులో కలిపి బాగా కలియబెట్టి ఈ పొటాటో కూరను తయార్ చేసుకోవాలి.
బియ్యం,పప్పులు, మెంతులు,విడివిడిగా కనీసం 7గంటలు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి,
తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి. పిండిని బాగా
కలియబెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని
ఈ మసాల కూరని దోసలో వుంచి సర్వే చేస్తే వావ్ భలే రుచి :)
!! సెట్ దోసె !! !! కావలసినవి !!
మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 1/2 కప్పులు
అటుకులు 1/2 కప్పు
మెంతులు 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు
!! చేసే విధానం !!
మినప్పప్పు,బియ్యం,మెంతులు,అటుకులు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా
రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణములో కాస్త మందంగా దోసెలు చేసుకోవాలి
ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది
కొబ్బరి చట్నీ,కూర్మా లేక సాగు తో వడ్డణ మరీ రుచి :)
పైన కరేపాక్ , కొత్తిమిరతో Decorate చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది :)
!! పేపర్ దోసె!! !! కావలసినవి !!
మినప్ప్పప్పు 1/2 కప్పు
బియ్యం 4 కప్పులు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె 1/2 కప్పు
!! చేసే విధానం !!
మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత
విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు
మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను
ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా
ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి
చట్నీ, సాంభార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
!! ఢోక్లా !!
!! కావలసినవి !!
సెనగపిండి 200gm
పెరుగు 1 కప్
అల్లం గోలికాయంత
సోడా 1 టేబల్ స్పూన్
నిమ్మరసం 1 టేబల్ స్పూన్
నూనె 1 టేబల్ స్పూన్
!! పోపుకి కావలసినవి !!
నూనె 3 టేబల్ స్పూన్స్
ఆవాలు 1 టేబల్ స్పూన్
కరివేపాకు 2 టేబల్ స్పూన్స్
కొత్తిమిర 2 టేబల్ స్పూన్స్
!! చేసే విధానం !!
సెనగపిండి, పెరుగు,ఉప్పు,తగినంత నీరు కలిపి
కాస్త చిక్కగా కలిపి కనీసం 4 గంటలు నాననివ్వాలి
పచ్చిమిర్చి,అల్లం ముద్ద, పసుపు అందులో వేసిబాగా కలపాలి
ఒక పెద్ద గిన్నెలో నీరుపోసి వేడి చేయాలి
ఒక చిన్న గిన్నెలో సోడా ,నూనె,నిమ్మరసం కలిపి పిండిలో వేసి బాగా కలియబెట్టాలి
ఒక వెడల్పాటి గిన్నెకు అన్నివైపులా నూనె రాసి ఈ పిండి మిశ్రమం వేసి సమానంగా సర్ది
పెద్ద గిన్నెలో మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరిపై పదిహేనునిమిషలు ఉడికించాలి
చల్ల్లారాక ముక్కలుగా కోయాలి.ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు
కరివేపాకు వేసి చిటపటలాడాక దింపి పావు కప్పు నీరు కలిపి ఈ ఢోక్లా ముక్కలపై
సమానంగా పోయాలి.ఆ నీటిని పీల్చుకుని అవి మృదువుగా అవుతాయి. కొత్తిమిర,
కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించాలి !!!
!!! అటుకుల ఉప్మా !!!
కావలసినవి !!!
గట్టి అటుకులు 200gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
పచ్చి కొబ్బరి తురుము 3 tsp
చేసే విధానం !!!
గట్టి అటుకులు ఐతేనే బాగుంటుంది. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు, తరిగిన
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి. అటుకులను నీళ్ళలో వేసి తీసి నీళ్ళన్నీపిండేసి ఈ పోపులో వేసి తగినంత ఉప్పు వేసి
బాగా కలియబెట్టి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమిర,కొబ్బరి తురుము చల్లి దింపేయాలి.వేడిగానే తినాలి.
!!! సేమ్యా పులిహోరా !!!
!! కావలసినవి !!!
సేమ్యా 200 గ్రాములు
ఉల్లిపాయ 1
కరివేపాకు
పల్లీలు
జిలకర
నూనె తగినంత
నెయ్యి కొద్దిగా
ఎండు మిర్చి 6
ఆవాలు
మినపప్పు
నిమ్మకాయ 1
తయారు చేసే విధానం !!!!
పాన్ లో ఒక చెంచా నెయ్యివేసి సేమ్యాను దోరగా వేయించాలి . తరువాత నూనె వేసి తాలింపు సామాను
కరేపాకుతో, ఉలీముక్కలి ఎండుమిర్చి వేసి
అన్నీ ఎర్రగా వేయించాలి. పొయ్యి sim లో వుంచి ముందుగా వేయించి వుంచుకొన్న సేమ్యాను ఇందులో వేసి మరో నిముషానికి దించి పళ్ళెం
లో పోసిపెట్టుకోవాలి . అదే పాన్ లో 2 గ్లాసుల నీళ్ళు పోసి సరిపదా ఉప్పు వేయాలి . నీళ్ళు మసలుతుండగా పళ్ళెం లో వేయించి వుంచిన
సేమ్యానంతా వేసేయాలి . అది ఉడుకుతుండగా నిమ్మకాయ గింజలు లేకుండగ రసం పిండాలి . stove ని sim చేసి అట్లకాడతో కలుపుతూ
3 నిముషాలతరువాత దింపుకోవాలి ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్........