Friday, July 24, 2009

!! పన్నీర్ ఫ్రైడ్ రైస్ !!

!! కావలసినవి !!

పన్నీర్ ముక్కలు -- 200 గ్రాం

బాస్మతి రైస్ -- 500 గ్రాం

నూనె -- 60 గ్రాం

పచ్చిబఠాణి -- 35 గ్రాం

జీడిపప్పు -- 30 గ్రాం

పచ్చి కొబ్బరి తురుము -- 1/2 కప్పు

క్యారట్ తురుము -- 1/4 కప్పు

ఉల్లికాడల తురుము -- 1/4 కప్పు

చిల్లీ సాస్ -- 1 టీస్పూన్

టొమాటో సాస్ -- 1.5 టీస్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద -- 1.5 టీస్పూన్

గరం మసాలా పొడి -- 1/2 టీస్పూన్

మిరియాలపొడి -- 1/2 టీస్పూన్

!! చేసే పద్ధతి !!

ఒక బాణలి లో కొద్దిగా నూనె వేడి చేసి ముక్కలుగా కోసిన పన్నీర్ ముక్కలు,జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

బియ్యం కడిగి కాస్త పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.బాణలి లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

ఉల్లికాడల తురుము,పచ్చిబఠానీలు,క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.

చిల్లీసాస్,టోమాటో సాస్,మిరియాల పొడి,గరం మసాలా పొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇందులోనే పన్నీర్ ముక్కలు,జీడిపప్పు ముక్కలు,బిరుసుగా వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి.

చివరగా తురిమిన కొత్తిమిర,కొబ్బరి కూడా వేసి 1 నిమిషం ఉంచి దింపేయాలి.

10 నిముషాలు అలానే ఉంచి ఆ తర్వాత వడ్డించేయడమే...

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥


!! థాయ్ ఫ్రేడ్ రైస్ !!

!! కావలసినవి !!

బాస్మతి బియ్యం -- 1 కప్

క్యారెట్ -- 1

బీన్స్ -- 15

క్యాప్సికం పెద్దది -- 1

పచ్చీబటాణీలు -- 1/4 కప్

ఉల్లికాడలు -- 1/2 కప్

!! మసాల చేసే విధం !!

పండుమిర్చి పేస్ట్ -- 1 టీ స్పూన్

ఆనియన్స్ -- 2

అల్లం,వేల్లులిపేస్ట్ -- 1 టీ స్పూన్

బెసిల్ ఆకులు -- 10

దనియలు -- 1/2 టీ స్పూన్

జీలకర్ర -- 1 టీ స్పూన్

ఉప్పు -- తగినంత

ఇవన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి.

!! తయారు చేసే విధానం !!

ముందుగా వెజిటెబుల్స్ చిన్నగా కట్ చెసుకోవాలి,అన్నం పొడిగా వండుకోవాలి

మూకుడులొ నూనె వేసి కూరగాయల ముక్కలు వేసి వుడికించాలి.

అవి మగ్గిన తరువాత రేడి చేసుకున్న మసాల పేస్ట్ వేసి పచ్చి వాసన పొయే వరకు వేపాలి.

తరువాత చల్లార్చుకున్న అన్నం వేసి బాగా కలపాలి.తరువాత ఉల్లికాడలు వేసి కలిపి దింపాలి.వేడి వేడి గా తింటే

భలేరుచి మరి మీరూ త్వరపడండి :)

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥


!! కొబ్బరి మామిడి పలావు !!

30 నిముషాలలో తయారయ్యే ఈ పలావు
పార్టీలకు స్పెషల్‌గా వడ్డించవచ్చు.

!! కావలసినవి !!

బాస్మతి రైస్ -- 1 కిలో

పచ్చి మామిడి ముక్కలు --200 గ్రా

కొబ్బెరి పాలు -- 200 ఎం ఎల్

ఉల్లిపాయలు -- 2

దాల్చిన చెక్క -- 5

యాలకులు -- 5 గ్రా

మిరియాలు -- 5 గ్రా

పసుపు -- చిటికెడు

జిలకర్ర -- 10 గ్రా

అల్లం,వెల్లుల్లి, పేష్ట్ -- 1 టీ స్పూన్

ఆయిల్ లేదా నెయ్యీ -- తగినంత

!! తయారు చేసే విధానం !!

బాస్మతి బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.

ఒక పాత్రలో నెయ్యివేసి,చెక్క,యాలకులు,జిలకర్ర,మిరియాలు వేసి,

వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు,వేయించుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేష్ట్ కూడ కలిపి వేయించి,

నానబెట్టిన బియ్యం కలిపి గట్టిగా మూతపెట్టి,

సన్నటి సెగమీద ఉడక నివ్వాలి. 20 నిముషాలపాటు ఉడకనీయండి.

మూత తీయకూడదు సుమా. ఆ తరువాత గరిటతో జాగ్రత్తగా కలిపి

అందులో కొబ్బెరపాలు,పసుపు,మామిడి ముక్కలు వేసి కలిపి

ఒక 6 నిముషాలు ష్టవ్ పై అలాగే వుంచి తర్వాత తీయండి.

ఘుమ ఘుమ లాడే కొబ్బరి మామిడి పలావ్ తయార్ :)


!! గ్రీన్ రైస్ !! Green Rice

!! కావలసినవి !!

సన్నబియ్యం --250గ్రా

పచికొబ్బెర ఒక చిప్ప

కొత్తిమీర కట్టలు -- 3

పచ్చిమిర్చి -- 6

గ్రీన్ పీస్ -- 1/2 కప్పు

దాల్చిన చెక్క-- 4

ఏలకులు -- 4

తేజ్‌పత్రి -- 4

జీడిపప్పు -- 20

కిస్‌మిస్‌లు -- 10

ఉప్పు తగినంత

నెయ్యి,డాల్డ,ఎదైన--1 కప్పు

జీర -- 1 టేబల్ స్పూన్

!! చేసే విధానం !!

ముందుగా బియ్యం కడిగి వడకట్టాలి.

కొబ్బెర,మిర్చీ,కొత్తమిర,ఉప్పు,పసుపుతో
అన్నీ గ్రైండ్ చేసి పేష్ట్ చేసి వుంచవలెను.

సన్నటి సెగమీద కుక్కర్ వుంచి కొంచం నెయ్యి వేసి

అందులో జీర,తేజ్‌పత్రీ,దాల్చిన చెక్క,జీడిపప్పు,కిస్‌మిస్ వేసి కాస్త వేయించి

అందులోనే వడకట్టిన బియ్యం పోసి దోరగవేయించి

అందులో అరలీటరు నీరుపోసి గ్రీన్ పీస్,మిగతా నెయ్యి,తయారుగా వున్న పేష్ట్,వేసి సన్నటి సెగ మీద వుంచాలి.అన్నీ కలయబెట్టి 3 విజిల్స్ వచ్చక

ష్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తరువాత వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది.

ప్లాన్ గా చేసుకొంటే 20 నిముషాల పని అంతే~~~ మీ టిఫిన్ బాక్స్ రెడీ

!! వాంగి బాత్ !!
!! వాంగిబాత్ పౌడర్ !!

చెన్నాదాల్ -- 1 కప్

మినపప్పు (Urad dal) --1 కప్

ధనియ -- 3/4 - కప్

డ్రై చిల్లీ -- 25 గ్రా (కారం తగినంత)

లవంగాలు -- 3 ( clove )

చెక్క ( Cinnamon stick ) 1

కరేపాక్ 2 రెబ్బలు

ఎండు కొబ్బెర పౌడర్ (dessicated coconut )1/3 కప్పు

ఉప్పుతగినంత

!! చేసే విధానం !!

ముందు మూకుడు ష్టవ్ పై వేడి చేసి అందులో

విడి విడిగా అన్నీ దోరగా వేయించుకోవాలి

కొబ్బెర కొద్దిగ వేడి చేస్తే చాలు

తక్కిన వన్నీ దోరగా light golden brown వేయించి

అన్నీ గ్రైండర్లో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి.

!! కావలసినవి !!

రైస్ -- 2 క్ప్పులు

వంకాయలు -- పెద్దవి 6

దోసకాయలు -- 2

వాంగిబాత్ పౌడర్ -- 3 టేబల్ స్పూన్స్

కరేపాక్ రెబ్బలు 2

లెమన్ జ్యుస్ -- 1 టేబల్ స్పూన్

ఉప్పు తగినంత

పోపు గింజలు -- 2 టేబల్ స్పూన్స్

జీడిపప్పు -- 15 నేతిలో వేయించినవి

నూనె -- 2 గరిటెలు

నెయ్యి -- 2 టేబల్ స్పూన్స్

పసుపు -- 1/4

!! చేసే విధానం !!

ముందు రైస్ పొడి పోడిగా వండుకొని

అందులో పసుపు,ఉప్పు వాంగిబాత్ పౌడర్ 2 స్పూన్స్ ,కలిపి పెట్టుకోండి.

మూకుడులో నూనె వేసి అందులో ఆవాలు,జీర,డ్రై చిల్లీ వేసి

అవి వేగాక అందులో వంకాయ,దోసకాయ,

విడి విడి గా ఉప్పువేసి వుడికించి కొద్దిగా

వాంగిబాత్ పౌడర్ వేసి దించండి.

రైస్ లోకి కాస్త నెయ్యి కలిపి వాంగిబాత్ పౌడర్,

వుడికించిన వంకాయ, దోసకాయ జీడిపప్పు ఉప్పు వేసి బాగా కలపండి.

ష్టవ్ పై మూకుడు పెట్టి నూనే వేసి

ఆవాలు,ఉద్దిపప్పు,చనగపప్పు,జిలకర,ఇంగువ.

డ్రై చిల్లీ కరేపాక్ వేసి అవి చిటపటా చిటపటా

అన్న తరువాత తీసి అన్నంలోకి వేసి

లెమన్ జ్యూస్ వేసి కలిపి వడ్డించడమే....

( లెమన్ జ్యూస్ కావాలంటే వేసుకోవచ్చు,లేకుంటే లేదు )

(వేరుశనగపప్పు Peanut దోరగా వేయించుకొని వేసుకోవచ్చు

జీడిపప్పు బదులుగా )
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!! వెజి కట్టెపొంగల్ !!

!! కావలసినవి !!

తురిమిన కరెట్ 1

1/4కప్ గ్రీంపీస్

1/4 కప్ కార్న్

జీడిపప్పు 100 గ్రా

బియ్యం 1కప్

పెసరపప్పు 1/2కప్

నెయ్యి 3 టేబల్ స్పూన్స్

ఉప్పు తగినంత

అల్లం చిన్నముక్క తురిమినది

పచ్చిమిర్చి 3

జిలకర 1/2 స్పూన్

మిరియాల్ల పొడి 1/2 తేబల్ స్పూన్

చేసే విధానం !!

ముందు బియ్యం , పెసరపప్పు

వుడికించి పెట్టుకోండి .

తరువాత ఒక పాన్ లో నెయ్యివేసి అందులో

జిలకర వేసి వేగిన తరువాత

తురిమిన కారెట్ , బటానీ , కార్న్ , వేసి

అందులోనే తరిగిన పచ్చిమిర్చి

అల్లం ,ఉప్పు కోత్తమిర వేసి

అవన్ని వుడికిన తరువాత

అందులో ఈ వుడికిన రైస్ వేసి

బాగా కలియబెట్టి అందులో

మిరియాల పొడి వేసి

వేయించిన జీడిపప్పులు వేసి

పైన బాగా నెయ్యివేసి దించడమే

వేడి వేడి గా ఈ సంక్రాతి పోంగలి ని

దేవుడికి నైవేద్యం పెట్టి మనమూ ఆరగించడమే :)


!! పులిహొర !!

!! కావలసినవి !!

బియ్యం - 250 gms ( 2 tea cups )

నునె -4 tbl spoons

పచ్చిమెరప కాయలు -15

ఎండుమిరపకాయలు - 3

శనగపప్పు - 2 tbl spoons

మినపప్పు - 2 tbl spoons

జీడిపప్పు - 3 tbl spoons

వేరుశనగ గుళ్ళు - 3 tbl spoons

కరివేపాకు - 8

ఆవాలు - 2 tbl spoons

ఉప్పు -సరిపడినంత

పసుపు - 1/4 tbl spoon

చింతపండు పేస్టు - 5 tbl spoons

!! తయారు చేసే విధానం !!

ముందుగా బియ్యం నీ కడిగి 4 cups నీళ్ళు పోసి కూకెర్ లో వుడికించాలి .

అది కొంచెం పోడిగ అయ్యెలా చల్లారబెట్టాలి .

ఇప్పుడు పాన్ లో నునెను వేసి అందులో ఆవాలు , ఎండుమిరపకాయలు ,

పచ్చిమిరపకాయలు , మినపప్పు , శనగపప్పు , జీడిపప్పు ,

వేరుశనగ గుళ్ళు , కరివేపాకు , పసుపు వేసి బాగా వేయించాలి .

అందులో చింతపండు పేస్టు , ఉప్పు వేసి బాగా కలిపి బాగా వుడికించి చింతపండు వుడికి చిక్కపడాలి

స్టవ్వు మీద నుంచి దింపేయ్యండి .

ఇప్పుడు వుడుకించిన బియ్యాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి . పులిహొర తయారు అయ్యినట్టే

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥


!!!టొమటొ రైస్ !!!

!! కావలసినవి !!

బాస్మతి రైస్ - 2 cups(250 gms)

టొమటోలు - 4

బఠాణిలు - 1/2 cup(నానబెట్టి,వుడికించాలి)

బంగాలదుంప - 1

ఉల్లిపాయ - 2 (సన్నగ పొడుగ్గ)

పచ్చిమిరపకాయలు - 4

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 tbl spoon

లవంగాలు - 5

యాలకులు - 3

బిర్యాని ఆకు - 3

ఉప్పు - తగినంత

కొత్తిమెర

!! తయారు చేసే విధానం !!

1.కూకర్ లో నునె వేసి వేడి చేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి.

2.ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

3.అది వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.టొమటొ ముక్కలు వేసి వేయించాలి.

4.దానిలో బఠాణిలు,బంగాలదుంప ముక్కలు వేసి కొంచెంసేపు వేయించి అందులో సాంబార్ పొడి, ఉప్పు వేసి కలపాలి.

5.ఇప్పుడు బియ్యం కడిగి అందులో వేసి కొంచెంసేపు వేయించి అందులో నీళ్ళు(ఒక కప్పు బియ్యం కి 1 1/2 లేదా 2 కప్పు నీళ్ళు)పోసి ఒక
విసెల్ రానివ్వాలి.

6.అందులో కొత్తిమెర వేసి కలపాలి.ఇప్పుడు వేడి వేడి టొమటొ రైస్ నీ ఆరగించండి.


!!! బిసిబేళె బాత్ !!!

!!!! కావలసినవి !!!!

కందిపప్పు రెండున్నర పావులు ,

బియ్యం 2 పావులు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

2 వంకాయలు ,

1/2 సొర్రకాయ ,

2 దోసకాయలు ,

బీన్స్ తగినన్ని ,

2 పోటాటోలు ,

సెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు ,

5 బేబీ కార్న్ ,

2 క్యారెట్లు ,

3 టోమాటోలు ,

తగినంత కరేపాక్ ,

కోత్తమీర ,

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప ,

4 గ్రీన్ చిల్లి$స్ ,

నూనె తగినంత ,

నెయ్యి చిన్న కప్పు ,

చింతపండు గొజ్జు తగినంత ,

కాస్త జాగిరి ,

ఉప్పు , పసుపు ,

5 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు ,

ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము !!!!

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి కుక్కర్ లో కందిపప్పు , బియ్యం , పీనట్ వేసి , టోమాటో తప్ప

తక్కిన అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు , నీళ్ళు 8 పావులు వేసి రెండు విజిలస్ వచ్చాక stove off చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి , కరేపాకు , టొమాటో ,

చింతపండు గొజ్జు , సాంబర్ పౌడర్ , జాగిరి . వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవీ అంతా వుడికిన రైస్ లో వేసి, కోత్తమీర , కరేపాక్ ,

నెయ్యి వేసి మరోసారి కలయబెట్టి వుడికించండి , అంతా బాగా వుడికిన తరువాత , ఎండు మిర్చి , ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బెర వేసి కలిపి

దించండి వేడి వేడిగా తింటే భలే రుచి .