::కావలసినవి::
తాజా వంకాయలు 1/2 కిలో
శెనగపప్పు 3 టేబల్ స్పూన్స్
నువ్వులు 2 టేబల్ స్పూన్స్
ఎండుమిర్చి 5
జీలకర్ర 1 టేబల్ స్పూన్
మెంతులు 1/4 టేబల్ స్పూన్
ధనియాలు 3 టేబల్ స్పూన్స్
పసుపు 2 చిటికెలు
కొత్తిమిర సన్నగా తరిగినది 3 టేబల్ స్పూన్స్
ఉప్పు తగినంత
నూనె 4 టేబల్ స్పూన్స్
::చేసే విధానం::
వంకాయలు,నూనె,తప్ప మిగతా వస్తువులు అన్ని కొద్దిగా నూనే వేసి వేపి
బరకగా పొడి చేసుకోవాలి.
వంకాయలు నాలుగు వైపులా కోసి ఉప్పునీళ్ళలో వేసి ఉంచుకోవాలి.
వంకాయలలో కొద్దిగా మసాలా పొడిని కూరి పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి ఈ కూరిన వంకాయలను వేసి మూత పెట్టాలి.
నిదానంగా చిన్న మంటపై మగ్గనివ్వాలి.
అవి సగం మగ్గిన తర్వాత మిగతా పొడి కూడా కలిపి మళ్ళి మూత పెట్టి
నూనెలోనే ఉడకనివ్వాలి. చివరలో కొత్తిమిర చల్లి దింపేయాలి.
కావాలంటే ఎండు కొబ్బెర చల్లితే రుచి ఎక్కువ.
ఎవరైన వచ్చినప్పుడు కొబ్బెర వేసి చేస్తే బాగుంటుంది :)
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! వెరైటీ వంకాయ కూర !!
::కావలసినవి::
తాజా వంకాయలు 1/2 కిలో
(పోపుగింజలు 1 టేబల్ స్పూన్
ఆవాలు,మినపప్పు,చనగపప్పు,
జిలకర్ర,ఎండుమిర్చి.)
పుట్నాల పోడి 2 టేబల్ స్పూన్స్
చింతపండు జ్యూస్ 1 టేబల్ స్పూన్
ఎండు కొబ్బెర కోరినది 2 టేబల్ స్పూన్స్
రుచికి ఉప్పు,చిటికెడు పసుపు.
చిటికెడు ఇంగువ
నూనే:: 1 గరిటెడు
గ్రీన్ చిల్లి 2
కరేపాక్ 2 రెబ్బలు
కోత్తమిర తరిగినది 1 కట్ట
::చేసే విధానం::
( ఈ కూర ఉడికించేముందు 2 నిముషాలే ప్లేట్ మూయాలి
తరువాత మూయకుండగనే వంకాల్ని ఉడికించాలి.
ముక్కలు విరకుండగా,ముద్ద కాకుండగా వస్తుంది.)
ముందు వంకాయలు బాగా కడిగి
చిటికిన వేలంత పోడవుగా ముక్కల్ని చేసికోవాలి.
మూకుడులో నూనె వేసి వేడిచేసి అందులో పోపుగింజలు వేసి
అవి దోరగా వేగాక అందులో ఇంగువ,పసుపు,
చీలికలు చేసిన గ్రీన్ చిల్లీ,కరేపాకు వేసి
అవి కాస్త వేగనిచ్చి అందులో వంకాయ ముక్కలు వేయాలి.
వంకాయ ముక్కలపై ఉప్పు వేసి 5 నిముషాలు వేగనిచ్చి
వాటిపై చింతపండుజ్యూస్ వేసి
బాగాకలిపి 5 నిముషాలు వుడకనివ్వండి.
ఉప్పు,చింతపండు రసం ముక్కలకు బాగా పట్టాలి.
వుడికిన వంకాయ కూరపై పుట్నాల పౌడర్,కొబ్బెర కోరు
వేసి బాగా కలిపి 2 నిముషాలు అట్టే వుంచండి.
కర కర లాడే వంకాయ కూర రెడీ ఈ కూర చపాతికి
వేడి వేడి అన్నానికీ భలే రుచి :)
!! చిక్కుడు వుల్లికురా !! !! కావలసినవి !!
చిక్కుడు 1/4
ఆనియన్ 5
చిన్న అల్లం ముక్క
నూనె 50 గ్రాం
జీర 1/2 టీస్పూన్
ఉప్పు తగినంత
ధనియాలు 1/3 టేబల్‌స్పూన్
వెల్లుల్లిరేకులు 3
ఎండుకారం,పసుపు తగినంత
!! చేయు పద్ధతి !!
చిక్కుడు బాగా కడిగి మీకు కావలసిన రీతిలో కట్ చేసి వుంచవలెను
ఆనియన్,ధనియ,వెల్లుల్లి,ముద్దగా గ్రైండ్ చేసి వుంచండి.
నూనె కాచి కాస్త జీర వేసి,ఈ ఉల్లి,వెల్లుల్లి ముద్దని నూనెలో వేసి
కాస్త పచ్చివాసన పోయిన తరువాత చిక్కుడు,ఉప్పు,పసుపు,కారంపొడి వేసి
బాగా కలిపి బాగా వేయించి వుడికిన తరువాత
వేడి వేడి గా చపాతికి,వేడి వేడి అన్నానికి వేసుకొని తింటే యమ రుచి...మరి మీరూ రెడినా ?? :)
ఇలాగే అల్లంకారం కూడా చేసుకోవచ్చు
అల్లం,వెల్లుల్లిబదులు,అల్లం,తగుపాటి పచ్చిమిర్చి,ఆనియన్ నూరుకొంటే
అల్లం చిక్కుడు తయార్ :)
!! ఆనపకాయ టొమటో కూర !! !! కావలసినవి !!
ఆనపకాయ 1 ( సొరకాయ )
ఉల్లిపాయలు 3 to 4
పచ్చిమిరపకాయలు 4
టొమటొ 3
కారం 1/2 to 1 టేబల్ స్పూన్స్
పసుపు
ఉప్పు తగినంత
నునె 3 టేబల్ స్పూన్స్
ఆవాలు 2 టేబల్ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి .
అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .
ఇప్పుడు అందులో ఆనపకాయ ముక్కలు వేసి వేయించాలి .
అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి .
అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి .
అందులో కొంచెం నీళ్ళు వేసి ఆనపకాయ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .
!!!శనగపప్పు కొబ్బరి కూర !!! !! కావలసినవి !!
కొబ్బరి - 1 కప్ (125gms)
శనగపప్పు - 1/2 కప్
ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 3
ఎండుమిరపకాయలు - 3
క్యారేట్ ముక్కలు చిన్న కప్పు
కార్న్ 1/2 కప్పు
బీన్స్ 1/2 కప్పు
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 3
ఆవాలు - 1/4 టేబల్ స్పూన్
నునె - 2 to 3 టేబల్ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
ముందుగా శనగపప్పుని కడగాలి.
అందులో 1 కప్పు నీళ్ళు పోసి వేసి కుకర్ లో 1 విసెల్ రానివ్వాలి.
ఆ తర్వాత అందులో నీళ్ళని తీసెయ్యాలి.
ఇప్పుడు పాన్ లో నునె వేసి వేడి చేసి అందులో ఆవాలు,
ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
తర్వాత క్యారేట్,బీన్స్ కార్న్ ముక్కలు, వేసి వుడికించాలి.
ఇప్పుడు వుడికించిన శనగపప్పుని, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.
ఇప్పుడు కొబ్బరి వేసి 3 నిమషాలు వేయించి మంట మీద నుంచి దింపెయ్యాలి.
శనగపప్పు-కొబ్బరి కూర వేడి వేడి అన్నంతో ఆరగించండి.
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! కావలసినవి !!
కాలిఫ్లవర్ 1
ఉల్లిపాయలు 3
పచ్చిమిరపకాయలు 6
టొమటొ 3
కారం - 1 1/2 టేబల్ స్పూన్
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
నునె 4 టేబల్ స్పూన్స్
ఆవాలు 2 టేబల్ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి .
అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .
ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి.
అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి .
అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి .
అందులో కొంచెం నీళ్ళు వేసి కాలిఫ్లవర్ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .
ఘుమ ఘుమలాడే కూర తయార్.... మీరూ చేసి చూడండి :)
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! దొండకాయ kuura !!
దొండకాయలు ---- 1/2 కిలో పచ్చిమిర్చి ---- 4
నూనే ---- 2 గరిటెలు
పుట్నాల పోడి ---- 3 టేబల్ స్పూన్స్
ఎండు కొబ్బర ---- 2 టేబల్ స్పూన్స్
పసుపు , ఉప్పు . ---- రుచికి తగినంత
పోపు గింజలు :- ఆవాలు , మినపప్పు , చనగపప్పు ,
ఈ మూడు half half స్పూన్స్ వేయాలి.
జిలకర్ర , ఇంగువ , కరేపాకు , కొత్తిమిర .
!! చేసే విధానం !!
ముందు దొండకాయల్ని నీళ్ళతో బాగా కడిగి
మీకు కావలసిన రీతిలో కట్ చేసి వుంచండి.
ష్టవ్ పై మూకుడు పెట్టి అందులో నూనే వేసి నూనే కాగాక
పోపుగింజలన్నీ వేసి ఆవాలు చిట్లిన తరువాత పచ్చిమిర్చి , కరేపాకు
వేసి అందులోనే తరిగిన దొండకాయల్ని వేసి ఉప్పు పసుపుకుద వేసి
మూతపెట్టి 15 నిముషాలు వేగనివ్వాలి.
వేగిన కూరలో కొబ్బర , పుట్నాల పొడి , కొత్తిమిర చల్లి బాగా కలిపి
దించేయడమే... వేడి అన్నానికీ చాలా బావుంటుంది
నీరజ గారు ఈ కూరలో మీకు పుట్నాల పొడి వద్దంటే
వేసుకో నక్కరలేదు.
కావలసిన వారు ఇందులో ఆనియన్ వేసి మరో వెరైటీగా చేసుకోవచ్చు.
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! గోరు చిక్కుడుకాయల కూర !!
!! కావలసినవి !!
చిక్కుడు కాయలు --- 1/2 కిలో
ఎండు మిర్చి --- 4
వెల్లుల్లి --- 3
జిలకర్ర --- 1/2 టీ స్పూన్
చింతపండు గుజ్జు --- 2 టేబల్ స్పొన్న్స్
పచ్చికొబ్బరకోరు --- 3 టేబల్ స్పూన్స్
(ఎండు కొబ్బరైనా ఒకే)
పుట్నాలు (Roasted Chana Dal) 3 టేబల్ స్పూన్స్
పోపు గింజలు:- ఆవాలు,మినపప్పు,చనగపప్పు,జిలకర్ర,
పచ్చిమిర్చి 2 ,కరేపాకు 2 రెబ్బలు, నూనె 2 గరిటెలు.
ఉప్పు, రుచికి తగిననత
కొత్తిమిర ఒక కట్ట
!! చేసే విధానం !!
గోరుచిక్కుడుకాయలు బాగా కడిగి,తరిగి వుంచుకొండి.
ఎండుమిర్చి,వెల్లుల్లి,కొబ్బర,జిలకర్ర,పప్పులు,చింతపండు.అన్నీ గ్రైండ్ చేసి వుంచండి.
ష్టవ్ పై మూకుడు వుంచి ఒక గరిటెడు నూనె పోసి వేడి చేసిన తరువాత
అందులో పోపుగింజలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత గోరుచిక్కుడు,
పసుపు,ఉప్పు, వేసి బాగాకలిపి మూతమూసివుంచండి.
10 నిముషాల తరువాత ఈ గ్రైండ్ చేసిన పేష్ట్ వేసి మళ్ళి బాగా కలిపి
10 నిముషాలు మాడకుండగ వుండకనివ్వండి. అప్పుడప్పుడు మూత తీసి కలియబెట్టాలి.
బాగా మెత్తగా వుడికిన తరువాత కొత్తిమిర చల్లి దించేయడమే...
చపాతికి,వేడి అన్నానికి,పుల్కాలు, వీటన్నిటికి భలే రుచిగా వుంటుంది.
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! వంకాయ పచ్చికారం !!
!! కావలసినవి !!
వంకాయలు --- 1/2 కిలో
నూనె --- 1 కప్పు
ఉప్పు , రుచికి తగినంత
పసుపు , చిటికెడు
అల్లం ముక్క , గోలికాయంత
పచ్చి మిర్చి --- 6
ధనియాలు --- 1 చెంచా
జిలకర్ర --- చిన్న చెంచా
వెల్లుల్లి --- 6
కొత్తిమిర తరుగు --- 1 కట్ట
!! తయారు చేసే విధానం !!
ముందుగా ధనియాలు,జిలకర్ర,అల్లం,పచ్చి మిర్చి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
వంకాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
బాణలి వేడి చేసి అందులో నూనె మూడు వంతులు పోసి నునె వేడెక్కగానే
ముక్కలు వేసి 5 నిమిషాలు మూతపెట్టి వుంచాలి.
తర్వాత ముక్కలు మాడకుండగా కలుపుతూ , ఉప్పు , పసుపు , చల్లి మళ్ళీ బాగా కలపాలి.
వంకాయ ముక్కలు పూర్తిగా వేగినట్లు తెలియగానే పచ్చికారం ముద్ద వేసి బాగా కలపాలి.
వంకాయ ముద్దపై కొత్తమిర చల్లి వేడి వేడి గా వడ్డించడమే....
ఘుమ ఘుమ లాడే వంకాయ పచ్చికారం , చపాతి , రొట్టెల్లోకి , అన్నానికి భలే కమ్మాగా వుంటుంది.
కావాలంటే చనగపప్పు,మినపప్పు,జిలకర్ర,
ఆవాలు ఎండి మిర్చితో పైన పోపు వేసుకోవచ్చు .
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! సొరకాయ నూపప్పు వేసి కూర !!
సొరకాయలు -- 2
!! పోపుకు కవలసినవి !!
ఎండు మిర్చి , పచ్చి మిర్చి , రెండుకలిసి 3
మినపప్పు -- 1/4 టేబల్ స్పూన్
శనగపప్పు -- 1/4 టేబల్ స్పూన్
ఆవాలు -- 1/2 టీ స్పూన్
ఇంగువ -- చిటికెడు
కరివెపాకు -- 2 రెబ్బలు
!! నూపప్పు పొడికి కావలసినవి !!
నూపప్పు -- 4 -- టేబల్ స్పూన్స్
జిలకర్ర -- 1 టీ స్పూన్
ఎండు మిర్చి -- 2
ఈ మూడు కొద్దిగ నూనె వేసి వెయించి పొడి చేసుకోవాలి.
సొరకాయలు చిన్న ముక్కలుగా కొసి ఉడికించి ఉంచుకొవాలి.
కొద్దిగా పాన్ లో నూనె వేసి పోపుగింజలు వేసి చిటపతలాడిన తర్వాత
ఉడికించిన సొరకాయ ముక్కలు అందులో వేసి కొంచెం సేపు వేయించాలి.
చివర్లో చేసుకున్న నూపప్పు పొడి వేసి ఒక ఐదు నిముషాలు ఉంచి దించేసుకోవాలి.
ఇది నా Friend చేసింది రుచి చూసి నేను చేసా
చాలా బాగుంటుంది మీరూ చేసుకోండి .:)
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!! వంకాయ టోమాటో కూర !!
::కావలసినవి::
వంకాయ 1/2 కిలో
ఆనియన్ 2
కారం పొడి 1/2 స్పూన్
టోమాటో 3
గరం మసాల పౌడర్ 11/2 స్పూన్స్
జీర 1 టీ స్పూన్
కోత్తమిర సన్నగా తరిగినది 1 కట్ట
నూనే 1 గరిటెడు
::చేసే విధానం::
ముందు వంకాయలు బాగా కడిగి
మీకు కావలసిన షేపు లో కట్ చేసుకొని
ఉప్పు నీటి లో వేసి వుంచవలెను.
ష్టవ్ పై మూకుడు వుంచి అందులో నూనే వేసి కాగిన తరువాత
జీర,కరెపాక్,వేసి అందులోనే తరిగిన ఆనియన్ వేసి దోరగా వేయించాలి.
దొరగా వేగిన తరువాత అందులో గరం మసాల,కారం పొడి, వేసి, అందులోనే టోమాటో వేసి
టోమాటో సగం వుడికినాక వంకాయలు,ఉప్పు పసుపు,వేసి
ఒక మారు అంతా కలయ బెట్టి 5 నిముషాలు ఉడికాక కొత్తమిర
వేసి వేడి వేడి గా వడ్డించడమే..ఇది చపాతికీ,
వేడి వేడి అన్నానికీ బాగుంటుంది.
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!!! గుత్తొంకాయ కూర !!!
!! కావలసినవి !!
లేత వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 150 gm
పల్లీలు 50 gm
నువ్వులు 50gm
జీలకర్ర 1 tbsp
మెంతులు 1/2 tsp
కొబ్బరిపొడి 100 gm
చింతపండు పులుసు 1/4 cup
నూనె 50 gm
ఉప్పు తగినంత
కారం పొడి 1 tbsp
పసుపు 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp
బెల్లం కొంచం
!! చేసే విధానం !!
ముందుగా ఖాళీ బాణలిలో జీలకర్ర,మెంతులు,పల్లీలు,నువ్వులు విడివిడిగా వేయించాలి.
అవి పక్కన పెట్టి అందులోనే సగం నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
వేసిగోధుమ వర్ణం వచ్చేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి.
ఇవి అన్ని కొబ్బరిపొడితో కలిపిరుబ్బి పెట్టుకోవాలి.
ఈ ముద్దలో ఉప్పు,కారం పొడి,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,
చింతపండు పులుసు,బెల్లం వెసి బాగ కలిపి పెట్టుకోవాలి.
వంకాయలను నాలుగుపక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీల్లల్లో వెసి పెట్టాలి.
ఈ రుబ్బిన ముద్ద వంకాయమధ్యలొ బాగా కూరి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసికాగిన తర్వాత
ఈ మసాల కూరిన వంకాయలను వేసి మూత పెట్టలి.
ఈ కూరనునిదానంగ చిన్న మంటపై చేయాలి.
అన్ని వంకాయలు మగ్గి మెతబడిన తర్వత
మిగిలిన ముద్దలో కొద్దిగా నీరు కలిపి అందులో పోసి
మెల్లిగ కలిపి మూత పెట్టాలి..కూర ఉడికిన తర్వాత నూనె తేలుతుంది.
కొతిమిర చల్లి దించేయడమే..ఇక గుత్తొంకాయ కూర రేడి.
నోరూరించే గుత్తోంకాయ మీరూ చేయండి :)
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
!!! బీన్స్ పొరియల్ !!!
బీన్స్ 200 గ్రా ,
శనగపప్పు 100 గ్రా ,
పచ్చిమిర్చి 10 ,
కొబ్బెర తురుము 1/2 కప్పు ,
అల్లం చిన్న ముక్క ,
నూనె 100 గ్రా ,
కరేపాక్ , కోత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ తరుగు ,
తాలింపు గింజలు 2 టీ స్పూన్స్ ,
ఎండుమిర్చి 2 ,ఉప్పు , పసుపు , తగినంత
!!!!!! చేసే విధానం !!!!!!
శనగపప్పు కడిగి 2 గంటలు నాన బెట్టి జల్లెడలో వేసి నీరు తీసి, పచ్చిమిర్చి , కొబ్బెర , అల్లం , శనగపప్పు , మిక్సిలో వేసి ముద్ద చేసి
ఉంచండి . కొంచెం నూకగా రుబ్బాలి , మెత్తగా వుండకూడదు . బాండిలో నూనె వేడి చేసి తాలింపు వేసి ఎండుమిర్చి , కరేపాకు వేసి దోరగా
వేగాక బీన్స్ తరుగు , వేసి, మూతపెట్టి వుడికించి , ముక్క వుడికిన తరువాత పసుపు , రుబ్బిన శనగపప్పు ముద్దను , ఉప్పు ,
వేసి , బాగా దోరగా వేయించి , అట్లకాడతో వేయిస్తు వుండాలి . ముద్ద బాగా పొడి పొడి గా అయ్యేంతవరకు వేయించి కోత్తమీర వేసి సర్వ్
చేయండి , బీన్స్ పొరియల్ నెయ్యి వేసిన రైస్ లోకి , సాంబర్ రైస్ లోకి , రసం రైస్ లోకి , చాలా రుచిగావుంటుంది . ఇది తమిళులు
ఎక్కువగా చేస్తారు .