Friday, July 24, 2009

Frys

!! అరటికాయ వేపుడు !!


!! కావలసినవి !!

అరటికాయలు -- 4

మజ్జిగ --- 2 కప్పులు

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

కారం --- 1 టేబల్ స్పూన్

నూనె --- 3 టేబల్ స్పూన్స్

ఆవాలు , జీలకర్ర , 1 టేబల్ స్పూన్

ఎండు మిర్చి ముక్కలు -- 6

కరివేపాకు --- 1 రెబ్బ

ఇంగువ --- 2 pinches

!! చేసే పద్ధతి !!

అరటికాయ పై పెచ్చు పీల్ చేసి చక్రాలుగా కాని చిన్న ముక్కలుగా కాని

తరిగి మజ్జిగలో వేయాలి లేకుంటే నల్లబడతాయి.బాణలిలో నూనె వేసి

కాగిన తర్వాత ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి , కరివేపాకు , వేసి అవి చిటపటలాడాకా

అరటిముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

మధ్య మధ్యలో కదుపుతూ ఎర్రగా దోరగా వేగిన తర్వాత దింపాలి

వేడి వేడి అన్నంలోకి భలే రుచి ఆహా...ఏమి రుచీ :)


!! బెండకాయ వేపుడు !!



బెండకాయ వేపుడంటే అందరికీ తెలిసినదే
కాని అది చేసే విధానానంలోనే వుంది రుచి అంతా
ఎవ్వరైనాసరె రెండుముద్దలు ఎక్కువ తినితీరాల్సిందే..
మీకూ తెలిసే వుంటుంది బెండకాయల్ని ఎలా చేయాలన్నది
కాని వాటిని వేయించే దానిలోనే వుంది చిట్కా అంతా
కాస్త టైం తీసుకొని ఓపిగ్గా చేస్తే భలే భలే రుచి ఈ వేపుడు.
మరి మీరూ ఇలా చేసి మీ అత్తగారినుండి,మీ భర్త గారినుండి
మెప్పులు పొందాలనుకొంటున్నారా ఆలస్యం దేనికీ ప్రోసీడ్ కాండీ :)

!! కావలసినవి !!

బెండకాయలు -- 1/2 కిలో
డ్రై చిల్లీ పౌడర్ --1/2 టేబల్ స్పూన్

ఉప్పు తగినంత

చింత పండు జ్యూస్ -- 1/2 టేబల్ స్పూన్

వెల్లుల్లి పాయలు -- 6

నూనె -- వేపుడికి తగినంత

::: చేసే విధానం :::

ముందు బెండకాయల్ని శుభ్రంగా కడిగి

గుడ్డాతో తుడిచి మీకు కావలసిన షేపులో కట్ చేసి వుంచండి

ష్టవ్ పై మూకుడు పెట్టు అందులో నూనె వేసి

సన్నటి సెగపై వెల్లుల్లి వేయించి అందులోనే

తరిగిన బెండకాయల్ని వేసి ఉప్పు జల్లి

అటు ఇటు కలయబెట్టి 5 నిముషాలు వరకు

కాస్త మూత మూసి పెట్టండి.

తరువాత మూత తీసి అందులో చింతపండు జ్యూస్ చల్లి

మూత మూయకుండగ అటు ఇటు వేపుతు

10నిమిషాలు సన్నటి సెగపై వేయించాలి.

కాస్త దోరగా వేగిందని తెలిసాక అందులో కారంపొడి చల్లి

అటు ఇటు జాలి గరిటతో తిప్పుతూ కారం అంతా కలిసేటట్లు చేయాలి.

ష్టవ్ ఆఫ్ చేసి 5 నిముషాలు మూత మూయకండగ

వుంచితే వేపుడు కర కర లాడుతూ కమ్మగా రుచిగా వుంటుంది


!! కాకరకాయ కాష్మోరా !!(మసాలతో)



!! కావలసినవి !!

కాకరకాయలు 1/2 కిలో

నూనె 1/4 కిలో

ఆనియన్ 5

వెల్లుల్లిరేకులు 3

గసగసాలు 1టేబల్‌స్పూన్(Poppy Seeds)

ధనియాలు 1 టేబల్‌స్పూన్

చిన్న అల్లం ముక్క

ఉప్పు,పసుపు. తగినంత

!! చేయు పధతి !!

కాకరకాయలు గంట్లు పెట్టి ఓపాటి పసుపు,ఉప్పు,రాసి వుడకేయండి.

ఉడుకు పట్టగానే దింపి వార్చి పెట్టుకోండి.

అల్లం,వెల్లుల్లి,ధనియాలు,గసగసాలు, ఒక ముద్దగానూ

ఉల్లిపాయలు(ఆనియన్) వేరే ముద్దగానూ గ్రైండ్ చేయండి.

అల్లం ముద్దా,వుల్లిముద్దా కలిపేయండి.

(నచ్చితే 2 లవంగాలు చెక్కకూడ నూరి ఈ ముద్దలో కలుపులోవచ్చు)

కాకరకాయలు నీరులేకుండగ పిండేసి దాంట్లో మసాలకారం కూరండి.

నూనె కాచి మసాల నిండిన కాకరకాయల్ని నూనెలో దోరగా వేయించి,

వేడి వేడి అన్నంలోకి తింటే జిహ్వ్వానికి పేష్టులా అతుక్కొపోతుందని

ఎక్స్ పర్టుల సర్టిఫికేట్టు ...మరి మీరూ తయారేనా...?... :)


♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!!! దొండకాయ వేపుడు !!!

!!! కావలసినవి !!!

దొండకాయలు - 1/2 kg

ఉల్లిపాయ - 1

ఆవాలు - 1 tbl spoon

పసుపు -చిటికెడు

కారం - 1/4 to 1/2 tbl spoon

కొబ్బరి పొడి - 1/4 to 1/2 tbl spoon

ఉప్పు -తగినంత

కరివేపాకు - 5

నునె - 3 to 4 tbl spoons

!!! తయారు చేసే విధానం!!!

1.దొండకాయల్ని సన్నగ పొడుగ్గ కట్ చేసుకోవాలి.

2.ఇప్పుడు పాన్ లో నునె వేసి దానిలో ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.

3.అందులో ఉల్లిపాయ ముక్కలు(సన్నగ పొడుగ్గ)వేసి వేయించాలి.

4.ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి కొంచెంవేయించాక
అందులో కారం, పసుపు, ఉప్పు వేసి దొండకాయ ఉడికేవరకు బాగా వేయించాలి.

5.ఇప్పుడు కొబ్బరి వేసి 5 నిమషాలు వేయించాలి.


♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥

!!! కాకరకాయ వేపుడు !!!

1/4 కాకరకాయలు ,

కారం 1 టీ స్పూన్ ,

ఉప్పు తగినంత ,

జీరా 1 టీ స్పూన్ ,

నూనె తగినంత ,

50 గ్రాముల ఉల్లిపాయలు ,

2 వెల్లుల్లి రెబ్బలు ( ఇష్ట పడేవారు ) .

!!!!!! చేసే విధానం !!!!!!

కాకరకాయలు కడిగి గుండ్రంగా చక్రాలుగా కట్ చేసి , ఉప్పు నీళ్ళ లో 1/2 గంట వుంచితే చేదు తగ్గుతుంది , అవితీసి ప్లేటు లో పెట్టి ,

ఉల్లిపాయలను కట్ చేయాలి గుండ్రంగా , బాండిలో నూనె వేడి చేసి , కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించి , ఉల్లితరుగు వేసి ఎర్రగా

వేయించి , బాండిలో నూనె తీసి , వేపుడు ముక్కలలో జీరా వెల్లుల్లి దంచిన ముద్దను , కారం , ఉప్పు , వేసి రెండు నిముషాలు వేయించి

తీయాలి , కరకరలాడాలంటే ఎర్రగా వేయించాలి , మెత్తగా కావాలంటె ముందే తీయాలి , తినేవారిపై ఆధారపడి వుంటుంది .


♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥


!!! బంగాళాదుంప బంపర్ మసాలా వేపుడు !!!

మీ అభిరుచిని బట్టి ఉప్పు , కారం , అరచంచా ,

గసగసాలు , 3 చెంచాలు

ధనియాలు కొద్దిగా ,

చెక్కా , 2 లవంగాలు 2 ,

3 వెల్లుల్లిపాయలు ,

10 నీరుల్లిపాయలు ,

చిన్న అల్లం ముక్క ,

పావుకిలో నూనె ,

1 కిలో బంగాళా ( గోళీ ) దుంపలు .

!!!! చేసే విధానం !!!!

మనం కొన్నవి చిన్న చిన్న గుడ్రపాటి గోళీలాంటి బంగాళదుంపలైతే ఒకసారి కడిగేసి వుడికేయాలి ,

వుడికేసేముందు ఆ నీళ్ళ లో ఉప్పు , పసుపు , వేయాలి ,

వుడికాక తొక్కతీసి ( వేడి తగ్గిన తరువాత ) పెట్టుకోవాలి .

అల్లం , వెల్లుల్లి , చెక్కా , లవంగం , ధనియాలు , గసగసాలు , నీరుల్లిపాయలు ,

అన్నీకలిపి ముద్దగా నూరాలి , నూనె కాచి , మసాల ముద్దను వేయించి ,

పచ్చివాసన పోయేదాకా వేయించాలి .

బంగాళదుంపల్ని అందులో గుమ్మరించి మాంచి వేపుమీద వున్నప్పుడే

తగుపాటి ఉప్పు కారాలుకూడా తగిలించి బాగా వేగనిచ్చి దించుకోవాలి .


♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥


!!! అరటి వేపుడు ఉల్లిమసాల !!!

!!!!! చేసేవిధానం !!!!!

5 అరటికాయలు చెక్కుతీసి మజ్జిగలోకి ముక్కలుగాతరిగి ,

మరుగుతున్న నీళ్ళలోవేసి ఓ పొంగు వచ్చాక , దింపి వార్చి పెట్టాలి .

పావుకిలో ఉల్లి , 3 అల్లం ముక్కలు , ముద్దగా నూరి ,

50 గ్రాముల నూనె లో వేసి 10 నిముషాల వేగనిచ్చి

తరువాత అందులో అరటి ముక్కలు , రుచిని బట్టి ఉప్పు , పసుపు , వేసి

మూతపెట్టాలి . మధ్య మధ్య అట్ల కాడతో కలుపుతూ ఎర్రగా వేగాక దింపుకోవాలి . :)


♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥