Saturday, July 25, 2009

Sweets

!! kobbarikaya రవ్వ లడ్డు !!
!! కావలసినవి !!

రవ్వ -- 1 కప్పు

తాజా తెల్లటి కొబ్బరి తురుము -- 2 కప్పులు

పంచదార -- 1 1/2 కప్పులు

జీడిపప్పు -- కిస్మిస్ -- 20

చిటికెడు కుంకుమ పువ్వు

యాలకుల పొడి -- 1/2 టేబల్ స్పూన్

నెయ్యి -- 1.5 కప్పు

!! చేసే పద్ధతి !!

సన్నటి సెగపై రవ్వను 2, 3, నిమిషాలు వేయించాలి.

రెండు స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు , కిస్మిస్ లు వేయించుకోవాలి.

కుంకుమపువ్వును ఒక టీ స్పూన్ పాలలో వేసి

పాలు నారింజరంగుకు మారేవరకు కలియబెట్టి పక్కన వుంచుకోవాలి.

పావుకప్పుకు మించి నీటిని పంచదారలో పోసి వేడి చేసి వడకట్టి

మరో రెండు నిమిషాలు కాచాలి.పాకం బుడగలు వస్తున్నప్పుడు ష్టవ్ కట్టేయాలి.

మందపాటి పాత్రలో నెయ్యివేడి చేసి రవ్వ,కొబ్బరి మిస్రమాన్ని సన్నని సెగపై

5 నుంచి 7 నిమిషాలు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి,యలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్ లు,

కుంకుమపువ్వు,కలిపిన పాలు వేసి కలియబెట్టాలి.

మిశ్రమం చల్లారాక నిమ్మకాయసైజు ఉండలు చేసుకొని

మూత గట్టిగా వున్న డబ్బాలో వుంచాలి.

అప్పుడప్పుడు మూత తీసి ఉండలు క్రిందికీ పైకీ మారుస్తుంటే

నెలరోజులు పాడైపోకుండగా వుంటాయి.

బనాన సర్‌ప్రైజ్ ~~ Banana Surprise
!! కావలసినవి !!

పెద్ద అరటిపళ్ళు ~~ 2

చెక్కర ~~ 300 గ్రా

కొరిన పచ్చి కొబ్బెరకోరు ~~ 1 కప్పు

నెయ్యి ~~ 1/2 కప్పు

ఆరజ్ జ్యూస్ ~~ 1 కప్పు

నేతిలో వేయించిన జీడిపప్పు ~~ 15

!! చేసే విధానం !!

ముందు అరటిపల్లు కట్ చేసి వుంచాలి.(గుజ్జుచేసినా ఒకే)

ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసి

బాగా పొంగువచాక అందులో చెక్కరవేసి

కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి

అందులో కట్ చేసిన అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.

అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి

పక్కన వుంచుకోవాలి.

మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్జ్యూస్ వేసి

బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర,

వేయించి ముక్కలు చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు

వుంచి తీసేయడమే ..ఇది బ్రేడ్కు,ఐస్క్రీంకు చాలా బాగుంటుంది.

ఒక విధంగా హల్వామాదిరిగా టేష్ట్ వస్తుంది.

!! మైసూర్ పాక్ !!
!! కావలసినవి !!

శనగపిండి --1 కప్

పంచదార -- 2 1/2 లేక 3 కప్పులు

ఈలాచి -- 4 ( పొడి చేసుకోవాలి )

నెయ్యి,బట్టర్ -- 1 1/2 కప్

వంట సోడా - 1/2 టేబల్ స్పూన్

!! చేసే విధానం !!

శనగపిండినీ దోరగా వేయించాలి (తక్కువ మంట మీద వేయించాలి)

పంచదారలో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి ।

పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది తీగలా సాగుతున్నట్టు వుండాలి.

ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో వేపిన శనగపిండినీ ,ఈలాచి పొడినీ కలపాలి

ఇప్పుడు కొంచెం నెయ్యినీ ,బట్టర్ నీ ( కరగబెట్టినది ) అందులో వేసి కలపుతూ వుండాలి

ఒక 10 నిమషాలు పాటు దానిని అలాగే కలుపుతూ వుందాలి

అందులో సోడానీ వేసి కలపాలి .ఇప్పుడు గరిటికి అంటుకొకుండా వుండెవరకు కలుపుతూ వుంచాలి

ఒక ప్లెటులో నెయ్యిని రాసి దానిలో ఆ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి అది వేడి వునప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి

మైసూర్ పాక్ తయార్

!! అరటిపండు హల్వా !!
!! కావలసినవి !!

అరటిపండ్లు 5 పెద్దవి

పంచదార 1 కప్

నెయ్యి 3 టేబల్ స్పూన్స్

జీడిపప్పు 15

యాలక్కులు (cardamons) 6

!! చేసే విధానం !!

అరటిపండు తోలుతీసి బాగా గుజ్జుగా mash చెసుకొండి.

మూకుడులో 11/2 స్పూన్ నెయ్యివేసి అందులో

జీడిపప్పుని దోరగా వెయించండి.

తరువాత మళ్ళి కొద్దిగ నెయ్యివేసి ఈ అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా రోష్ట్ చేయండి.

ఇలా 10 నిముషాలు రోష్ట్ (roast for 10 min)

చేసి అందులో పంచదార వేసి మళ్ళి 10 నిముషాలు రోష్ట్ చేయండి.

అందులో యాలక్కుల పౌడర్ వేసి బాగా కలిపి

కొద్దిగా నెయ్యివేసి అందులోనే జీడిపప్పుకూడావేసి

నెయ్యి అంటించిన ప్లేట్ లో ఈ హల్వాని వేసి

diamond shapes లో కట్ చేసుకోండి

!! వేరుశనగ పప్పుచెక్క !!
కావలసినవి !!

వేయించిన వేరుశనగ పప్పు 1 కిలో

బెల్లం 1/3 కిలో

నెయ్యి 6 స్పూన్స్

చేసే విధానం !!

వేరుశనగపప్పు బద్దలుగావుంటే పరవాలేదు కాని గింజలుగానే వుండిపోతే వాటిని రెండుగా విడగొట్టుకోవాలు .

వేరుశనగపప్పుని మీరు ఇంటిలో వేయించ్ఘుకొంటే మరీ మంచిది

బెల్లం సన్నగా తురుముకొని గిన్నెలో వేసి నీళ్ళు పోయాలి

ఈ గిన్నెను పొయ్యిమీదపెట్టి ముదురు గోధుమ రంగు పాకం వచ్చేవరకు కాచాలి.

పాకం వచ్చిందనగానే ఈ పాకంలో వేరుశనగ పప్పు వేసి

అన్నివైపులా సమానంగా వుండెలా కలపాలి.తర్వాతపొయ్యినుండి కిందికి దించాలి.

ఒక పళ్ళెంలో నెయ్యిరాసి అందులో ఈ వేరుశనగపప్పు పాకం పోసి

వేడిగా వున్నప్పుడే పళ్ళెమ్నిండా పరిచి

మీకు అవసరమైన సైజులో కట్ చేసుకొండి. వేరుశనగపప్పుచెక్క (బర్ఫీ) తయార్ :)

!! క్యారెట్ బర్ఫీ !!
కావలసినవి !!

క్యారెట్ 1/2 కేజి

పాలు 1/2 లీటర్

పంచదార 300గ్రా

నెయ్యి50గ్రా

జీడిపప్పు 20గ్రా

తయారు చేసే విధానం !!

క్యారెట్`ను సన్నగా తురమండి .

బాణలిలో క్యారెట్ మరియు పాలు కలిపి ఉడికించండి.

పాలు ఇగిరిపోయాక నెయ్యి వేసి కాసేపు ప్రై చేయండి.

తరువాత పంచదారపోసి మరి కొద్దిసేపు వుడికించండి .

ఇలా వుడికించినప్పుడు పాకం వస్తుంది ఈ పాకం

చిక్కపడిన తరువాత కోవాను పొడిగా చేసి చల్లండి

ఇంకా దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తరువాత దించంది

ఓ ప్లేట్ కి నెయ్యి పూసి అందిలో ఈ క్యారెట్ ముద్దను వేయండి

వీటి మీద జీడిపప్పులు జల్లి ముక్కలుగా కోయండి .

!! చిరోటి రవ కుడుములు !!
!! కావలసినవి !!

చిరోటి రవ 1/4 కేజి ( 1 గ్లాస్ )

మైదా పిండి 2 స్పూన్స్

కొద్దిగ ఉప్పు ( ఉప్పు మంగళకరానికి శ్రేష్టమంటారుగా పెద్దలు
అందుకే శాస్రానికి వేయాలంటే వేయాలి )

నూనె 2 స్పూన్స్

చిటికెడు సోడా

ఇదంతా కొద్దిగ నీళ్ళుపోసి పూరీ పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి.

2 3 గంటలు నానిన తరువాత పూరీలుగా వత్తుకోవాలి

!! పూర్ణానికి కావలసినవి !!

శనగ పప్పు 1 గ్లాసు

బెల్లం 2 గ్లాసులు

వేయించేందుకు తగినంత నూనే

ఎండుకొబ్బెర 3 టేబల్ స్పూన్స్

గసగసాలు 1 1/2 స్పూన్స్

జీడిపప్పు ముక్కలు 3 టేబల్ స్పూన్స్

!! చేయవలసిన విధానం !!

శనగ పప్పు నీళ్ళు వేసి వుడికించి

ఆ నీళ్ళన్ని వంపేసి అందులో చితగొట్టిన బెల్లం పొడిని వేసి

ఒక 2 నిముషాలు వుడక నిచ్చి గ్రైండ్ చేయండి.అందులో కొబ్బెర,

గసగసాలు,నేతిలో వేయించిన జీడి పప్పు వేసి బాగా కలపండి.

ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్ లో తీసివుంచాలి.

పూరీలుగా వత్తుకొన్న వాటిపై ఈ పూర్ణాన్ని పెట్టి చుట్టూ

గోటితో మడతలుగా మడచి నూనేలో దోరగా వేయించడి

పళ్ళెంలో అందంగా పేర్చి, వినాయుకుడి ముందు నేవెధ్యం పెట్టాలి .

తరువాత మీరారగించవచ్చు :) !!!

!! కోవా కజ్జికాయలు !!
!! కావలసినవి !!

పాలు 1 లీటరు

చక్కెర 1/2 కిలో

బెల్లం 1/2 కిలో

కొబ్బెర చిప్పలు నాలుగు

యాలకుల పొడి 1 స్పూన్

!! చేసే విధానం !!

పాలు మరగనిచ్చి చిక్కపడ్డాక చక్కరవేసి గరిటతో కలుపుతూ

దగ్గరగా వచ్చినప్పుడు యాలకుల పోడి వేసి

కోవా అయ్యెంతవరకు కలయ పెడుతూ వుండాలి . కోరివుంచిన కొబ్బెర తురుమును

బెల్లాన్ని రెండూ కలిపి ష్టౌ మీద పెట్టి రెండూ దగ్గరపడి గట్టిపడ్డ తరువాత

చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. ఒక్కొక్క వుండనూ తీసుకొని

దానిమీద తయారు చెసుకొన్న కోవాను పల్చగా చుట్టి పళ్ళెం లో పెట్టుకొని

బాగా ఆరనిచ్చాక పొడి డబ్బా లో వుంచుకోనాలి !!

!! ఢిల్లీ బాదుషా !!

!! కావలసినవి !!

మైదాపిండి 1/2 కేజి

చక్కర 1/2 కేజి

నీళ్ళు 1/2 కప్పు

చిటికెడు సోడా

డాల్డా 1/4 కప్పు

ఏలకుల పొడి 1/2 స్పూన్

నూనే 2 కప్పులు

!! చేసే విధానం !!

మైదా పిండిలో సోడా,నెయ్యి,నీళ్ళు

వేసి 15 నిముషాలు బాగా కలపాలి.

పిండిని వడపిండిలా కలుపుకోవాల

వాటిని వడలమాదిరిగా చేసుకొని

వేడి చేసిన నూనేలో వేయించండి.

అరకప్పు నీళ్ళలో 1/2 చక్కర వేసి

చక్కర కరిగెంతవరకు వుంచండి.

లైట్ గా తీగపాకం వచ్చెంతవరకు

పెడితే బాదుషాలపై చెక్కర నిలబడుతుంది

ఈ పాకంలో వేయించిన బాదూషాలు వేసి

15 నిముషాల తరువాత తీసి ప్లేట్ లో వుంచండి

కన్నులకు ఇంపుగా కనిపించే బాదూషాలు రెడీ :) !!


!! సెనగ పిండి లడ్డు !!

!! కావలసినవి !!

సెనగపిండి 150 gms

పంచదార 100 gms

కోవా 50 gms

నెయ్యి 60 gms

ఏలకులు 10

!! చేసే విధానం !!

బాణలి వేడి చేసి కొద్దిగానెయ్యి వేసి

సెనగపిండిని కమ్మని వాసన వచ్చేవరకునిదానంగా వేయించాలి

పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి

కోవాను కూడా కొద్దిగావేపి సెనగపిండిపంచదారపొడి

అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి

చేతికి నెయ్యి రాసుకొని వుండలు కట్టితే

వుండ విరిగిపోకుండగా గట్టిగా వుంటుంది :)


!! శనగపప్పు బొబ్బట్లు !!

!! కావలసినవి !!

శనగపప్పు 500 gm

బెల్లం 500 gm

మైదాపిండి 250 gm

నూనె అర కప్పు

నెయ్యి అరకప్పు

నెయ్యి కాస్త ఎక్కువైనా కమ్మగానే వుంటుంది.

యలకుల పొడి 1 టేబల్ స్పూన్

సోంఫు పొడి 3 టేబల్ స్పూన్స్

!! చేసే విధానం !!

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి

తర్వాత నీళ్ళువార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి

చివరలో యాలకులు,సోంఫు పొడులు కలపాలి

ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి

తరువాత మైదాపిండిలో కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి

ఈ పిండిముద్దను కనీసం ఒక గంట అయినా నాననీయాలి

నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని

చేతితో వెడల్పు చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి

నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద

పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి

పొయ్యి మీద పెనం వేడి చేసి ఈ బొబ్బట్టును నేతితో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి

వేడి వేడి బొబ్బట్టుపైవేడి వేడి గా కాచిన నెయ్యి వేసుకొని తినండి చాలా రుచిగా వుంటాయి

పాలు కావలసిన వారు పాలు వేడి చేసి బొబ్బట్లపై వేసుకొని తింటే...

వావ్.....భలేరుచిగా వున్నాయి :) మరి మీరూ త్వరపడండి.

వినాయక చవితినాడు నాయకునికి ఆరగింపు పెట్టండి మీరూ తరించండి :)!!


!!! క్యారట్ హల్వా !!!

!!! కావలసినవి !!!

తురిమిన క్యారట్ 250 gm

చక్కెర 100 gm

నెయ్యి 50 gm

జీడిపలుకులు 10

యాలకుల పొడి 1 tsp

పాలు 1/2 lit

!!! చేసే విధానం !!!

ముందుగా క్యారట్,చక్కెర కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి పొయ్యిమీద పెట్టాలి.

ఆ తర్వాత పాలు పోసి ఉడికించాలి.

కాస్త దగ్గర పడ్డాక జీడిపప్పుముక్కలు,యాలకుల పొడి వేసి కలపాలి.

పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక నెయ్యివేసి కలిపి దించేయాలి.

!!! సున్నుండలు !!!

!!! కావలసినవి !!!

మినప్పప్పు 100 gms

పంచదార 100 gms

ఏలకులు 5

నెయ్యి 50 gms

!!! చేసే విధానం !!!

ముందుగా మినప్పప్పును ఖాళీ బాణలిలో కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా

వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.

పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు మినప్పప్పు పొడి, పంచదార పొడి రెండింటిటిని బాగా కలపాలి.

కొద్ది కొద్దిగా తీసుకుని కరిగించిన నెయ్యి పోసి ఉండలుగా కట్టి పెట్టుకోవాలి.

ఇవి మాంచి పుష్టికరమైనవి.

ఈ విధంగానే మినుములతో కూడా చేస్తారు .

!!! రవ్వ లడ్డు !!!

!!! కావలసినవి !!!

బొంబాయి రవ్వ 250 gms

పంచదార 250 gms

ఎండు కొబ్బరి పొడి 50 gms

ఏలకులు 4

జీడిపప్పు 10

కిస్మిస్ 10

నెయ్యి 50 gms

పాలు 100 ml

!!! చేసే విధానం !!!

ముందుగా నెయ్యి కరిగించి జీడిపప్పు,కిస్మిస్ కొద్దిగా వేయించి

అందులోనే రవ్వను కమ్మని వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.

పంచదార ఏలకులు కలిపి మెత్తగాపొడి చేసుకోవాలి.

వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,

అన్నిబాగాకలిపికొద్దికొద్దిగా పాలు చల్లుకుంటూ ఉందలుగ చేసి పెట్టుకోవాలి.

ఇవి నెలరోజులువరకు నిలువ ఉంటాయి. త్వరగా చేయొచ్చు కూడా

మీరూ త్వరపడండి.... :)

!!! నువ్వుల లడ్డు !!!

!!!కావలసినవి !!!

తెల్ల నువ్వులు 250 gm

బెల్లం 250 gm

నెయ్యి 2 tsp

ఏలకులు 4

!!! చేసే విధానం !!!

బెల్లం కరిగించి వడకట్టుకోవాలి

నువ్వులు ఖాలీ బాణలిలో దోరగా వేయించాలి.

నువ్వుపప్పు నొట్లో వేసుకుంటే గుల్ల విచ్చినట్టు ఉండాలి.

బెల్లం ముదురు పాకం చేయాలి.

ఒకచిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి రెందు చుక్కలు పాకం అందులో వేస్తే అది వెంటనె ఉండకట్టాలి.

ఆ ఉండను నేలకేసి కొడితే విరగదు.

ఇప్పుడు నెయ్యి, ఏలకుల పొడి నువ్వులు అన్నీ వేసి బాగా కలిపి దించి.

నెయ్యి రాసిన పళ్ళెంలో చిన్న గరిటతో ఈ నువ్వులపాకాన్ని కొద్ది కొద్దిగా వేసి

చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేడి మీదనే ఉండలుగ చేసుకోవాలి.

అరగంట ఆరిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోడమే.

నాగుల చవితి నాడు చేసే నైవేద్యం !!!

!!! జాంగ్రీ !!!

!!! కావలసినవి !!!

మినప్పప్పు 250 gm

బియ్యం గుప్పెడు

పంచదార 1/2 kg

మిఠాయిరంగు చిటికెడు

నెయ్యి లేక నూనె వేయించడానికి

!!! చేసే విధానం !!!

మినప్పప్పును శుభ్రం చేసి బియ్యం కలిపి నీళ్ళు పోసి 4 గంటలు నాననివ్వాలి.

తర్వాత ఈ పప్పును కాటుకలాగా మెత్తగా రుబ్బుకోవాలి.

పంచదారలో కప్పుడు నీళ్ళు పోసి జిగురుపాకం చేసి మిఠాయిరంగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఒక మందపాటి గుడ్డకు రంధ్రం చేసి ,అంచులు కుట్టి, అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలు కలిపి

మూటలాగా పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.

ఎర్రగా కాలినతర్వాత తీసి పాకంలో వేయాలి.

అలా అన్ని చేసుకుని రెండుగంటలు పాకంలో నాననిస్తే, జాంగ్రీలు గుల్ల విచ్చి పాకం బాగా

పీలుచుకుని మృదువుగా ఉంటాయి.

జాంగ్రీ ,లేదా జిలేబీలు ,చేయడానికి ప్లాస్టిక్ బాటిల్ వంటిది దొరుకుతాయి.

అవి కూడా ఉపయోగించుకోవచ్చు...

!!! పెసర బొబ్బట్లు !!!

!!! కావలసినవి !!!

పెసరపప్పు 250 gm

పంచదార 250 gm

రవ్వ 250 gm

మైదా 100 gm

యాలకుల పొడి 1 tsp

నెయ్యి అరకప్పు

!!! చేసే విధానం !!!

పెసరపప్పును శుభ్రపరచుకొని గంట సేపు నీటిలో నాననివ్వాలి.

నానిన పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి.

ఉడికిన ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగ

పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి.

ఉడుకుతుండగా అందులో కొంచెం నెయ్యి,యాలకుల పొడి వేసి గట్టి పడేవరకు వుంచాలి.

తర్వత దించేయాలి.

చల్లారాక చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.

మైదా, రవ్వ కలిపి నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి.

ఒక పాలిధిన్ పేపర్‌కు నూనె రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి

వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ ముద్దను పెట్టి అంచులు మూసి

నూనె చేతితో చపాతీలా వత్తుకుని వేడి పెనంపై నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి.

ఇవి వేడి వేడిగా తింటే భలే రుచి :)


!!! చలిమిడి !!!

!!! కావలసినవి !!!

బియ్యం ఒక కప్పు

బెల్లం అర కప్పు

పచ్చికొబ్బరి పావు చిప్ప

గసగసాలు రెండు చెంచాలు

యాలకులు మూడు

నెయ్యి నాలుగు చెంచాలు

!!! చేసే విధానం !!!

ఒక రోజు ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం జల్లెడలో పోసి వడకట్టి

రోట్లో లేదా గ్రైండర్లో పొడి చేసుకుని జల్లించి తడి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి.

పిండి ఆరిపోకూడదు. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

బాణలిలో నెయ్యి వేడి చేసి కొబ్బరిముక్కలు ఎర్రగా వేయించి పక్కన ఉంచి, గసగసాలు

కూడా వేయించి తీసుకోవాలి.యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం తురిమి,

పావు కప్పు నీరు పోసి ఉడికించి, మరీ లేత కాకుండా మరీ ముదురు పాకం కాకుండా

చేసి యాలకుల పొడి, నెయ్యి కలిపి క్రిందకు దించి కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ

గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ చివరగా కొబ్బరిముక్క్లలు,గసగసాలు కూడా

కలిపి మూతపెట్టి ఉంచాలి. చలిమిడి రెడీ

!!! డబల్ కా మీటా !!!

!!! కావలసినవి !!!

బ్రెడ్ 8 స్లైసులు

చక్కెర 150 gm

పాలు 1/2 lit

యాలకుల పొడి 2tsp

కుంకుమపువ్వు చిటికెడు
లేదా కేసర్ రంగు

బాదాం5

జీడిపప్పు 5

కిస్‍మిస్ 5

నెయ్యి బ్రెడ్ స్లైసులు వేయించడానికి

!!! చేసే విధానం !!!

ముందుగా బ్రెడ్ స్లైసులను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

వాటిని నెయ్యిలోకాని రిఫైండ్ నూనెలో కాని ఎర్రగా వేయించాలి.

పాలు ,చక్కెర, కుంకుమపువ్వు కలిపిమరిగించి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి.

బ్రెడ్ ముక్కలను ఒక వెడల్పాటి పళ్ళెం‍లో పరిచివాటిపై ఈ వేడి చిక్కటి పాలు సమనంగా పోయాలి.

బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకుంటాయి.

పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపపు, కిస్‍మిస్ చల్లాలి.

ఇది వేడిగా కాని చల్లగా కాని వడ్డించాలి.మరి మీరూ మొదలెట్టండి :)


!!! పాకం గారెలు !!!

కావలసినవి

పొట్టుమినపప్పు 50గ్రా

బెల్లం 1 కి

రిపైండ్ ఆయిల్ తగినంత

ఉప్పు తగినంత

నెయ్యి 50 గ్రా

యాలకులు 5

తయార్ చేసే విధం

పొట్టుమినపప్పు నాలుగుగంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి

పొట్టువచ్చేవరకుచేతితో రుద్ది నీళ్ళతో కడగాలి .

ఆ తరువాత ఈ పప్పును గ్రైండర్ లో మరీమెత్తగాకాకుండ

గ్రైండ్ చేసి తరిగిన బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి

లేతపాకం వచ్చేవరకువేడి చేయాలి .

ఇప్పుడు ఒక మూకుడులో నూనెపోసి వేడికాగానే

మినపప్పు ముద్దను తడి అరచేతిపైన లేదా అరటాకుపైన గాని

అద్ద నూనెలో వేయాలి .వాటిని ఎర్రగా వేయించి ,

తీగపాకంలో ముంచి బాగా నాన నివ్వండి .

నోరూరించే పాకం గారెలు రెడి :)
చిట్కాలు

పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే,పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలపాలి

లేకపోతే ఈస్ట్ పోడి 1/4 టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో

ఈస్ట్ కలిపి పూరీ పిండిలో వెసి కలిపితే చాలా బాగా పూరీలు వస్తాయి

చల్లటి పాలువేసి కలిపినా పూరీలు క్రిస్పీగా వస్తాయి

ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి

కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి.

చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది


గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి

మృదువుగా రుచిగా ఉంటాయి. చల్లటి పాలు కలిపినా మౄదువుగా కాకుండగా విరక్కుండగ వస్తాయి.

చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.

సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే,

వాటి మీద నిమ్మకాయ రసం లేకపోతే తేనే వేసినా పళ్ళు నల్లగా మారవు


ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.


మునగాకు తీయాలంటే ఎవరికైనా తలనొప్పే

కాని దానికి ఒక చిట్కా వుంది ...చెప్ప మంటారా ?

సరే చెపుతా...మునగాకును చిన్న చిన్న రెమ్మలుగా త్రెంచి

పోలిథిన్ కవర్ లో వుంచి దాన్ని కుక్కర్ లో పెట్టి గాలిచోరకుండా

మూత పెట్టాలి...మర్నాడుదయం పళ్ళెం లో గుమ్మరిస్తే

చాలా విచిత్రంగా ఆకులన్నీ విడిపోయి వుంటాయి మనకూ పని తక్కువ.
!! పులుసులు !!
!! చిన్న ఆనియన్ పులుసు !!
!! కావలసినవి !!

చిన్న చిన్న ఆనియన్స్ 1Kg

పచ్చిమిర్చి తగినంత

కరేపాక్ 2రెబ్బలు కాస్త కోత్తమిర

నిమ్మసైజంత చింతపండు ( రసం)

ధనియ 1 స్పూన్

ఉప్పు , పసుపు , బెల్లం .

బియ్యం 1/2 స్పూన్

మెంతులు 6

నూనే తగినంత

తాలింపు గింజలు ఎండు మిర్చి.

చేసే విధానము !!

ముందుగ కడాయిలో కొద్దిగ నూనే వేసి

5 నిముషాలు ఆనియన్ న్ని దోరగా వేయించండి .

అందులోనే చిల్లి కరేపాక్ వేసి వేయించండి .

తరువాత ఉప్పు పసుపు బెల్లం.

చింతపండు పులుసు 2గ్లాసుల నీళ్ళు వేసి

బాగా వుడక నివ్వండి

పక్కన ధనియ మెంతులు బియ్యం

కాస్త వేయించి అవి గ్రైండ్ చేసి

ఆ పొడిని 1 గ్లాస్ నీళ్ళల్లో వుంటలు లేకుండగా కలిపి

ఈ పులుసులో వేయండి కాస్త కోత్తమిర వేసి మాంచిగా

ఎండు మిర్చితో తాలింపు పెడితే.....

దోసకి ఇడ్లీకి చాలా రుచిగా వుంటుంది :)

!! గుమ్మడికాయ పులుసు !!

!! కావలసినవి !!

చిన్న గుమ్మడికాయలో సగం ముక్క

ఆనియన్స్ --- 3

పచ్చిమిర్చి --- 3

ధనియాలు --- 1 1/2 టేబల్ స్పూన్స్

మెంతులు --- 1/2 టీ స్పూన్

చింతపండు --- పెద్ద నిమ్మకాయంత

ఎండుమిర్చి --- 4

నూనె --- 2 టేబల్ స్పూన్స్

ఉప్పు,పసుపు --- రుచికి తగినంత

బెల్లం --- చిన్న నిమ్మసైజంత

పోపుగింజలు --- ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి.

ఎండుకొబ్బెర --- 1 టేబల్ స్పూన్

బియ్యం పిండి --- 2 టేబల్ స్పూన్స్

కరేపాకు --- 2 రెబ్బలు

కొత్తిమిర --- 1/2 కట్ట

కారం --- 1/2 టేబల్ స్పూన్

!! చేసే విధానం !!

ష్టవ్ పై దట్టమైన కడాయివుంచి అందులో ఒక స్పూన్ నూనె వేసి

పచ్చిమిర్చి,కరేపాకు,ఆనియన్ వేసి వేయించి అందులో

పొట్టు తీసిన గుమ్మడికాయ ముక్కలు వేసి, 2 గ్లాసుల నీళ్ళుపోసి ఉడకబెట్టాలి.

ఎండుమిర్చి,ధనియాలు,మెంతులు,ఎండుకొబ్బర,అన్నీ దోరగా వేయించి గ్రైండ్ చేసి

పులుసులో వేయాలి.పసుపు,బెల్లం,ఉప్పు,కారం కొత్తిమిర వేసి,చింతపండు గొజ్జుతీసి

పులుసులో వేసి బియ్యంపిండిని సగం గ్లాసు నీళ్ళల్లో కలిపి పులుసులో వేసి

(చిక్కగావుంటే ఒక గ్లాసు నీళ్ళుపోసి ) బాగా వుడకనివ్వాలి.

ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి తో పోపు పెట్టి

వేడి అన్నానికి నెయ్యివేసుకొని తింటే..ఆహా...ఏమి రుచి...


!!! తోటకూర పులుసు !!!

::కావలిసిన పదార్ధాలు::

తోటకూర కట్టలు 2

ఆనియన్ 2

టమోటాలు 2

చింతపండు గుజ్జు 2 స్పూన్స్

కారం-- ఉప్పు--తగినంత..చిటికెడు పసుపు

పచ్చిమిర్చి 3

తిరగమోత గింజలు
(ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..అన్నీ ఒక స్పూన్)

::తయారుచేసే విధానం::

ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి.

అలాగే పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

మూకుడులో తిరగమోత వేసి ముందుగా ఉల్లిపాయ,టమోటా,పచ్చిమిర్చి,

వేసుకుని బాగా వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసుకుని చింతపండు గుజ్జు,పసుపు,

ఉప్పు,కారం ,వేసి 3 గ్లాసుల నీరు పోసి ఉడికించాలి.

బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి.

పులుసు మరీ నీళ్ళగా వుంటే ఒక స్పూన్ బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి

తోటకూర పులుసులో కలపడమే. పులుసు కాస్త చిక్కపడుతుంది.

కర్నాటిక వాళ్ళు ఇందులోనే పచ్చి కొబ్బెర వేసుకొంటారు

కావాలంటే మీరూ 2 స్పూన్స్ కోరిన పచ్చి కొబ్బెర వేసుకోవచ్చు :)
స్నాక్స్ ~~~ చిరుతిండ్లు
!! భేల్ పూరి !!

!! కావలసినవి !!

మరమరాలు ~~ 2 గ్లాసులు

టొమాటోలు~~ 1/2

ఆనియన్ ~~ 1

బంగాళదుంప ~~ 1

సన్న కారప్పూస ~~ 100 గ్రా

చింతపండు చట్నీ~~ 3 టీస్పూన్స్

పుదీనా చట్నీ~~ 2 టీస్పూన్స్

నిమ్మరసం ~~ 2 టీస్పూన్స్

కొత్తిమిర ~~ 1 టేబల్ స్పూన్

కారంపొడి 1 టీస్పూన్

ఉప్పు తగినంత

!! చేసే విధానం !!

ముందుగా ఆనియన్,టొమాటోలు సన్నగా కోసి పెట్టుకోవాలి.

బంగాళదుంపలు ఉడికించి పొడి చేసి పెట్టుకోవాలి.

వెడల్పాటి గిన్నెలో మరమరాలు,తరిగిన ఉల్లిపాయలు,టొమాటోలు,

కొత్తిమిర,చట్నీలు,బంగాళదుంప పొడి నిమ్మరసం,కారం,తగినంత ఉప్పు వేసి బాగా

కలియబెట్టాలి. చివరగా కారప్పూస,కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.

!! చింతపండు ~~ స్వీట్ ~~ చట్నీ !!
చింతపండు పులుసు 1 కప్పు

ఖర్జూరం 4

బెల్లం నిమ్మకాయంత

జీలకర్ర పొడి 1 టీస్పూన్

ఖర్జూరాలు విత్తనం తీసి చిన్న చిన్న ముక్కలుచేసి

అన్నీ కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.


!! పుదీనా ~~ గ్రీన్ ~~ చట్నీ !!
పుదీనా 1 కప్పు

కొత్తిమిర 1 కప్పు

పచ్చిమిర్చి 2

ఉప్పు తగినంత

అన్నీ కలిపి గ్రైండ్ చేయడమే

( కావాలంటే నిమ్మ రసం పిండుకోవచ్చు )

!! స్పెషల్ వడ !!

!! కావలసినవి !!

కందిపప్పు (Bengal gram dal) -- 1/2 కప్

మినపప్పు (Tuar dal) -- 1/2 కప్

జీర -- 1/2 టేబల్‌స్పూన్

డ్రైచిల్లీ -- 6

ఉల్లిపాయలు -- (onions) -- 1/2 కప్

కరేపాక్ 20 ఆకులు

ఉప్పు రుచికి తగినంత

నూనే -- (Oil) -- వేయించేందుకు తగినంత

!! చేసే విధానము !!

ముందు కందిపప్పు,మినపప్పు, రెండు నీళ్ళ ల్లో 6 గంటలు నానబెట్టాలి.

తరువాత నానిన వాటిలో ఎండు మెరపకాయలు,జిలకర్ర,ఉప్పు,

వేసి బరకగా రుబ్బుకోవాలి. (గ్రైండ్ )చేసుకోవాలి.

రుబ్బిన పిండిలో ఉల్లిపాయలు,కరేపాకు సన్నగా తరిగి

అందులో కలిపి రౌడుగా చేతిమీద కాని,ప్లాష్టిక్ షీట్ పై కాని

వడమాదిరిగా తట్టి,నూనేలో deep fry చేయాలి.

వేడి వేడి వడలపై కొబ్బర చెట్ని కాని,టోమాటో సాస్ తో కాని

తింటే చాలా కమ్మగా ఘుమ ఘుమ గా వుంటాయి.

!! స్వీట్ పూరీ !!

(దిన్ని మడత పూరీ అనికూడ అంటారు :)

కావలసినవి !!

మైదాపిండి -- 500 గ్రా

పంచదార -- 250 గ్రా

యాలకులు -- 8

నెయ్యి -- వేయించడానికి సరిపడా

ఫుడ్ కలర్ --- చిటికెడు

!! చేసే విధానం !!

ముందుగా మైదాపిండి లో వంద గ్రాముల నెయ్యి కలిపి

ఆపై నీళ్ళు జ్ళ్ళి ముద్దలా చేయాలి.

మైదా ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక దానిలో ఫుడ్‌కలర్ కలపాలి.

ఈ రెండు రకాల ముద్దల్ని విడి విడిగా చపాతీలా చేయాలి.

ఇప్పుడు మామూలు చపాతిమీద రంగు చపాతి ఉంచి వీటిని చాపలా చుట్టాలి.

ఈ రోల్ను చాకుతో ముక్కలుగా కోసి,ఒక్కో ముక్కను మళ్ళీ పూరీలా ఒత్తి

నేతిలో కరకరలాడేలా వేయించాలి.

పంచదార,యాలకులు కలిపి మెత్తగా పొడిలా చేయాలి.

ఈ పోడిని వేయించిన పూరీలమీద బాగా జల్లాలి...అంతే...స్వీట్ పూరీ తయార్....

!! సగ్గుబియ్యం వడలు !! sabudana vada !!
saggu బియ్యం --1 కప్

పోటాటో --(mashed potato)-- 1 కప్

గ్రీన్‌ చిల్లీస్ -- 4 , 5.

కోత్తమిర 1/2 కట్ట

జిలకర వేయించినది -- 1 టేబల్ స్పూన్

పంచదార -- 1/4

నూనే -- 100 గ్రా

ఉప్పు తగినంత

కరేపాక్ -- 2 రెబ్బలు

!! చేసే విధానం !!

ముందు సగ్గుబియ్యం వాటర్ లో 1 గంట నానబెట్టాలి.

పోటాటో కుక్కర్ లో పెట్టి మెత్తగా చేసుకొని

దాన్ని మెత్తగా పిసికి వుంచికోవాలి.

నానిన సగ్గుబియ్యం,mashed potato ఉప్పు వేసి కలిపి,

అందులో పంచదార,కోత్తమిర,కరేపాకు,చిల్లీ,అన్నీ సన్నగా తరిగి

వేసి జిలకర వేసి ఉప్పు తగినంత వేసి అంతా బాగా కలపండి.

మూకుడు లో నూనె వేసి వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వడలుగా

చేసుకొని నూనే లో వేయించాలి Deep fry on medium heat

అంతే.....సగ్గుబియ్యం వడలు తయార్...వేడి వేడి గా

కొబ్బెర చట్ని తో గాని టోమాటో సాస్ తో గాని తింటే మళ్ళి వదలరు :)

( పంచదార వేస్తే గోల్డెన్ కలర్ వస్తుందనీ...రుచిగా వుంటుందని వేయడమే )

!! అరటికాయ చిప్స్ !!

అరటికాయలు పీల్ చేసి చక్రాల్లా తరుగుకొని

ఉప్పు వేసి ఉడికించాలి.

తరువాత మాంచి ఎండలో బాగా ఎండనివ్వాలి.

బాగా ఎండాక నూనెలో వేపుకుని పైన కారం చల్లి తినాలి.

ఇవి నెలా రెండు నెలలు నిల్వ ఉంటాయి.

కూరలేవీ లేనప్పుడు ఇవే ఆధారం.

సాంబారులోకి ,రసంలోకి చాలా బావుంటాయి.

!! మిరపకాయ బజ్జీ !!

!! మిరపకాయ బజ్జీ !!

లావు మిరపకాయలు 250 gm

శనగపిండి 250 gm

ఉప్పు తగినంత

కారం 1 tsp

గరం మసాలా 1 tsp

ధనియాల పొడి 2 tsp

వంట సోడా చిటికెడు

నూనె వేయించడానికి

పుదీనా 1/2 cup

నువ్వులు 1/4 cup

పచ్చిమిర్చి ౩

చింతపండు పులుసు 2 tbsp

మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి.

మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే కారం తగ్గుతుంది.

నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి

చింతపండు పులుసు కలిపి మెత్తగ నూరి పెట్టుకుని

మిరపకాయలలో కూరి పక్కన పెట్టుకోవాలి.

శనగపిండిలో తగినంత ఉప్పు,కారం, గరమ్ మసాలా,

ధనియాలపొడి, వంట సోడా వేసి నీళ్ళు కలుపుతూ

గరిటజారుగా ఉండలు లేకుండా కలిపి అర గంట అలా ఉంచాలి.

మళ్ళీ కలిపి కూరి పెట్టుకున్న మిరపకాయలను

ఒక్కొక్కటిగా వేడి నూనెలో ఎర్రగా కాల్చి వేడి వేడిగా


టొమాటో సాస్ కాని ఆవకాయతో కాని తింటే
సూపర్‍గా ఉంటుంది.

కావాలాంటే మిరపకాయలలో కస్త వాము,చింతపండు


పులుసు,ఉప్పు,కొబ్బరిపొడి కలిపి రుబ్బి
మిరపకాయలలో కూరొచ్చు.. బంగాళదుంప కూర చేసి


అది కూడా మిరపకాయలలో కూరి
బజ్జీలు చేసుకోవచ్చు. అప్పుడు మిరపకాయలు చాలా లావుగా వస్తాయి

!! ఫ్రెంచ్ ఫ్రైస్ !! French fries
బంగాళదుంపలు 5
నూనె వేయించడానికి్ తగినంత

బంగాళదుంపలను నిలువుగా సన్నని ముక్కలుగా కోసి చల్లటి నీటిలో

గంట సేపు నానబెట్టాలి. తర్వాత తీసి నీరంతా ఓడ్చి, తడి ఆరేవరకు

ఉంచి వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.

!! కాలిఫ్లవర్ మంచురియా !!
!! కావలసినవి !!

కాలిఫ్లవర్ 1

{చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి }

ఉల్లిపాయలు 2

అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబల్ స్పూన్స్

కారం 2 టేబల్ స్పూన్స్

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

పచ్చిమిర్చి పేస్టు 3 టేబల్ స్పూన్స్

కొత్తిమెర 1/2 కట్ట

రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు

సొయా సాస్ 2 టేబల్ స్పూన్స్

కార్న్ ఫ్లోర్ 2 టేబల్ స్పూన్స్

{1 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి }

గోధుమ పిండి 1 టెబల్ స్పూన్

బియ్యం పిండి 1/2 చుప్

బేకింగ్ పౌడర్ 1/2 టేబల్ స్పూన్

నిమ్మకాయ జూసు 2 టేబల్ స్పూన్స్

నునె వేయించడానికి

!! తయారు చేసే విధానం !!

ఒక గిన్నెలో గొధుమ పిండి, బియ్యం పిండి, 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,

బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 టేబల్ స్పూన్ సోయా సాస్,

1 టేబల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబల్ స్పూన్ కారం, పసుపు,

1 టేబల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, కొంచెం నీళ్ళు పోసి వేసి అన్ని కలుపుకోవాలి.

ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులుగా కట్ చేసినవి ఇందులో వేసి కలపాలి.

పాన్ లో నునె నీ వేడి చేసి అందులో ఈ కాలిఫ్లవర్ పువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్ లో 3 టేబల్ స్పూన్స్ నునె వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

కొంచెం వేయించాక 1 టేబల్ స్పూన్ అల్లుం వెల్లుల్లి పేస్టు, 2 టేబల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్టు,

1 టేబల్ స్పూన్ కారం వేసి వేయించాలి.

అందులో 1 టేబల్ స్పూన్ సోయా సాస్ వేసి వేయించాలి.

ఇప్పుడు మంటను తగ్గించి దానిలో ముందుగా నీళ్ళలో కలిపి వుంచుకున్న కార్న్ ఫ్లోర్ నీ,

రెడ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకోవాలి.

అది అలా కలిపాక కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కొత్తిమెర వేసి కలపాలి.

అందులో కాలిఫ్లవర్, నిమ్మజూసునీ వేసి కలపాలి.

!! మైసూర్ బొండా !!
!! కావలసినవి !!

మైదా - 2 కప్స్

పుల్లటి పెరుగు-2 కప్స్

బియ్యంపిండి -1/2 కప్

ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్

పచ్హిమీరపకాయలు - 4

సొడా -1/4 టేబల్ స్పూన్

ఉప్పు తగినంత

కొత్తిమెర

!! తయరుచెసే విధానం !!


మైదా , పెరుగు , బియ్యంపిండి , ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిర్చి ముక్కలు , కొత్తిమెర , ఉప్పు , సొడా అన్ని కలిపి వుంచాలి.

కొంచం గట్టిగ కలపాలి. అందులొ ఎమైన తక్కువ అయితే మైదా , పెరుగు , బియ్యంపిండి వేసుకొవచ్హు.

ఒక పాన్ లొ నునే వేసి వేడిచెసి , అందులొ కలిపిన పిండిని బొండాలుగా ఫ్రై చెయ్యాలి.

!! పానీ పూరీ !!

పూరి చేసే ఐటమ్స్ !!!

మైద 1 కప్పు

రవ 1/4 కప్పు

కుక్కింగ్ సోడ 3 చిటికెలు

ఉద్దిపప్పు 2 టెబల్ స్పూన్స్

రుచికి తగినంత ఉప్పు.

పూరి చేసే విధానం !!

ఉద్దిపప్పు దోరగా వేయించి పౌడర్ చేసి వుంచండి .

రవ , మైదా , సోడా , ఉద్దిపొడి , ఉప్పు. అన్నీ చల్లటి నీళ్ళుపోసి గట్టిగా పూరీ పిండిలా కలిపి , తడి ఆరకుండగా తడి గుడ్డవేసి 2 గంటలసేపు నానపెట్టాలి .

తరువాత చిన్న చిన్న పూరీలుగా చేసి నూనెలో వేయించు పెట్టుకొండి .

పానీ చేసే విధానం !!!

చింతపండు రసంలో జిలకర వేయించి పౌడర్ చేసి పానీలో కలపండి .

దానితో పాటు పుదిన , కొతమిర , గ్రీన్ చిల్లీ , అన్నీకలిపి గ్రైండ్ చేసి పానీలో కలపంది .

ఫోటాటో కూర:

కావలసినవి !!!

పొటాటో 1/2 కిలో

సన్నగా తరిగిన 2 ఆనియన్స్

పచ్చ బటాని , కార్న్ , 2 పిడికిళ్ళు .

cheese 2 స్పూన్స్

గరం మసాల పౌడర్ 3స్పూన్స్

కొత్తమిర , ఉప్పు , పసుపు . తగినంత.

కూర చేసే విధానం !!!

పొటాటో కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక దింపి చల్లారిన తరువాత పొట్టుతీసి మెత్తగా చెసి వుంచుకోవాలి .

తరువాత పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి దోరగా వేయించి , అందులో గరం మసాల , ఉప్పు , పసుపు , రెడ్ చిల్లీ

పౌడర్ 2 స్పూన్స్ , వేసి పచ్చిబటానీలు , కార్న్ అన్నీ అందులో వేసి బాగా వుడికించి కాస్త బట్టర్ వేసి సన్నటి సెగపై 5 నిముషా అలాగే

వుంచి కోత్తమీర వేసి ష్టావ్ ఆఫ్ చేయండి.

పూరి గిన్నెలా hole చేసి అందులో పొటాటోకూర పెట్టి దానిపైపానీ వేసి , పచ్చి ఆనియన్,వేసి తింటే ........వావ్....యమ రుచి :)

మీకు కావాలంటే సన్నగా తరిగిన ఆనియన్స్ . కుకుంబర్ , కారెట్ , టోమాటో slices చేసి , plate లో decorate చేసి పూరితో

పాటు ఇవీ తింటే మరీ మరీ రుచి .:)

!! ఆలూ పరాఠా !! Alu parota

బంగాళదుంపలు 3

గోధుమపిండి 3 cups

మైదా 1 cup

జీలకర్ర 1 tsp

కారంపొడి 1 tsp

గరంమసాలా 1/2 tsp

కొత్తిమిర 2 tsp

కరివేపాకు 1 tsp

ఉప్ప 1/2 tsp

నూనె 50 ml

పెరుగు 3 tbsp

పసుపు 1/4 tsp

బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలోమైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,

సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,

బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి

తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్తుకోవాలి.

తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని

చపాతీల్లా వత్తి వేడి పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.

ఘుమ ఘుమ లాడే వేడి వేడి పరోటా తయార్ :)

!!! బ్రెడ్ బజ్జీలు !!!
కావలసినవి

బ్రెడ్ 8 స్లైసులు

శనగ పిండి 2 కప్పులు

ఉప్పు తగినంత

కారం పొడి 1 tsp

అల్లం వెల్లుల్లి 1 tsp

వంట సోడా చిటికెడు

గరం మసాల పొడి 1/2tsp

వాము లేదా జీలకర్ర 1/2tsp

నూనె వేయించడానికి

చేసే విధానం

ముందుగా బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

వాటిని టోస్టర్లోకాని పెనం పై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి.

గిన్నెలో శనగపిండి,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా

జీలకర్ర,గరం మసాలా పొడి,వంట సోడా కలిపి నీళ్ళు పోసి

గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.

నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో

ముంచి నూనెలో వేసి ఎర్రగావేయించాలి .

వేడి వేడిగా సాస్ కాని ఆవకాయ కాని నంజుకుని తింటె అదిరిపోతుంది.

!! వెజిటబుల్ సమోసా !!

కావలసినవి :

సమోసా తయారి :

మైదా - 1 cup

నెయ్యి - 1/2 cup

బేకింగ్ పౌడర్ - 1/4 tbl spoon

ఉప్పు - తగినంత

నీళ్ళు

కూర తయారికి :

బంగాలదుంపలు - 2( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).

ఉలిపాయాలు - 1 ( ముక్కలు)

పచ్చి బఠానీలు - 1 cup

పచ్చిమిరపకాయలు - 2

కొత్తిమెర

నిమ్మ జూసు - 2 tbl spoon

పసుపు - 1/2 tbl spoon

గరం మసాల - 1/2 tbl spoon

కారం - 1 tbl spoon

ఆవాలు - 2 tbl spoons

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tbl spoon

ఉప్పు - తగినంత

నునె - వేయించడానికి

కరివేపాకు - 4

తయారు చేసే విధానం :

మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.

కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.

కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.

కూర విధానం :

ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి.

అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి.

అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.

కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.

అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.

కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.

చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి

వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.

అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.

సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.

!!!!!! కాబేజి రోల్స్ !!!!!!

!!!! కావలసినవి !!!!

కాబేజి 1/4

మొక్కజొన్నపిండి 10 గ్రాములు

నూనె తగినంత

కారెట్స్ 1/4

బియ్యం పిండి 1/4 కప్

!!!! తయారు చేసే విధానము !!!!

కాబేజీ , కారెట్ లను కొబ్బరిలాగా తురుమాలి . పచ్చిమిర్చిని , ఉప్పు , మొక్కజొన్న పిండిని కలపాలి .దీనిని ముద్దగా చేయాలి చిన్న

చిన్న బాల్స్ లాగా చేయాలి .పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత కాబేజీ బాల్స్ ని తగినంతగా వేయించి అంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చెంత

వరకు వేయించీ సాస్ తో గాని చిట్ని తో గాని సర్వ్ చేయాలి :)


!!! ఆలూ చిప్స్ !!!
ఆలూ 1 కిలో ,
నూనె 300 గ్రా

జీరా 1 టీ స్పూన్ ,

ఉప్పు 1 టీ స్పూన్ ,

1 టీ స్పూన్ కారం ,

ఆం చూర్ పోడి 1 టీ స్పూన్ .

!!!!!! చేసే విధానం !!!!!!

ఆలు బాగా కడిగి పొట్టు తీసి పలుచగా ఆలు చిప్$స్ కొట్టే పీటపై కొట్టాలి ఆలు చిప్$స్ ఒక పొడి బట్టపై వేసి, ఆరిన తరువాత , బాండీలో నూనె

వేడి చేసి , బాగా వేడి అయిన తరువాత , ఆరిన చిప్$స్ పచ్చివి బాండిలో కొన్నివేసి వేయించి జల్లిగరిటతో తీసి పేపర్ పై వేయాలి . అలా

అన్ని చిప్$స్ వేయించుకొని తీసి , మళ్ళీ 5 నిముషాల తరువాత నూనె వేడి చేసి చిప్$స్ ఎర్రగా వేయించాలి , అప్పుడు బేసిన్ లో తీసి ,

ఉప్పు , కారం , జీరా , ఆం చూర్ ,పొడి కలిపి తింటే చాలా బాగుంటాయి . రెండుసార్లు వేయించడం వలన చాలా కరకరలాడుతాయి .

చల్లార్చి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి :)

!!! చేగోడీలు !!!
కావలసినవి !!!

బియ్యపు పిండి -

3 గ్లాసులుమైదా -

1 గ్లాసునెయ్యి -

50 గ్రావాము -

1/2 టీస్పూనుపసుపు -

1/4 టీస్పూనుకారంపొడి -

1/2 టీస్పూనుఉప్పు -

తగినంతనూనె -

వేయించడానికి సరిపడినంత

తయారుచేసే విధానం !!!

ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి

దించవలెను.ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై
మూతపెట్టవలెను.

పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా

అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు తయార్

!!! సేమ్యా బోండా !!!
కావలసినవి !!!!

సేమ్యా 1/4 కేజి ,

క్యాబేజీ 100 కేజి ,

క్యారట్ 50 గ్రాం ,

మంచినూనె 1/4 కేజి ,

నెయ్యి లేదా డాల్డా 50 గ్రాం ,

శనగపిండి 1 కప్పు ,

బియ్యం పిండి 1 కప్పు ,

ఉల్లిపాయలు 1 ,

పచ్చిమిర్చి 4 ,

అల్లం అంగుళం ముక్క ,

కారం 1 టీ స్పూన్ ,

ఉప్పు తగినంత ,

పసుపు 1/2 టీ స్పూన్ ,

వంట సోడా చిటికెడు ,

కరివేపాకు ఒక రెబ్బ ,

ఆవాలు 1/4 టీ స్పూన్ ,

జీలకర్ర 1/4 టీ స్పూ

న్జీడిపప్పు 8 .

చేసే విధానం !!!!

ముందుగా సేమ్యాను నేతిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పుగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి వేడి చెసి

ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేసి ఆతర్వాత తరిగిపెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీవేగాక తరిగిన

క్యాబేజీ,తురిమిన క్యారట్, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించాలి.నీళ్ళు

మరుగుతుండగావేయించిన సేమ్యాను వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూఉండాలి. దింపేముందు జీడిపప్పు,సన్నగా

తరిగిన కొత్తిమిర వేసి కలపాలి.శనగపిండి,బియ్యంపిండి మిశ్రమంలో తగింత ఉప్పు,కారం పొడి, వంటసోడా నీళ్ళుపోసి బజ్జీల పిండిలా

కలపాలి.పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి.సేమ్యా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసిపిండిలో ముంచి నూనెలో వేసిఎర్రగా

వచ్చేలా వేయించి తీయాలి. ఇవి వేడి మీద తింటే చాలా బావుంటాయి

!!! బియ్యపు చెక్కలు !!!
బియ్యపు పిండి 1/2 కేజి ,

జీలకర్ర 1/2 స్పూను ,

కారం పొడి 1/2 స్పూను ,

ఉప్పు తగినంత ,

కరివేపాకు 1 రెబ్బ ,

నానబెట్టిన పెసర పప్పు 100 గ్రాం ,

కరిగించిన నెయ్యి లేదాడాల్డ 50 గ్రాం .

ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి,సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర,కరిగించిననెయ్యి,నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి ఒక గ్లాసు

మరిగించిన నీరు పోసిమొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిందిని బాగ కలిపి చిన్న చిన్నఉండలుగా చెసుకుని పాలిథిన్ కవరుపై

నూనె రాసి పల్చగా వత్తి వేడి నూనెలోఎర్రగా వేయించి పెట్టుకోవాలి.కావలంటె వేయించిన పల్లీలు కూడ వేసుకోవచ్చు.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి
!!! బ్రెడ్ మంచూరియా !!!

బ్రెడ్ 6 స్లైసులు ,

మైదా 1/2 కప్పు ,

కార్న్ ఫ్లోర్ 1 టేబల్ స్పూన్ ,

అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీస్పూన్స్ ,

మిరియాల పొడి 1 టీస్ పూన్స్ ,

కారం పొడి 1/2 టీస్ పూన్స్ ,

ఉప్పు తగినంత ,

సోయా సాస్ 1/2 టీ స్పూన్స్ ,

అజినొమొటో చిటికెడు ,

పచ్చిమిర్చి 1 ,

ఉల్లి పొరక 1/4 కప్పు ,

బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.

ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి

కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.ఈ మిశ్రమం మరీ చిక్కగా

కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి. పొయ్యి మీద నూనె వేడి చేసి

ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అలా

అన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి.తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల

నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లి పొరక,

పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను

కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి

మరిగించాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.

ఈ వంటకం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.

అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేపి బ్రెడ్ ముక్కలు వేసి

కలిపి ఓ నిమిషం తర్వాత దించితే సరి.


!! బియ్యంపిండి chegodilu !!
!! కావలసినవి !!

బియ్యంపిండి -- 3 (పెద్ద) గ్లాసులు

పెసరపప్పు -- 1/2 కప్పు

ఉప్పు -- రుచికి తగినంత

వాము -- 1 టీ స్పూన్

ఎండు కారం -- 2 టేబల్ స్పూన్స్

నూనె -- వేయించెందుకు తగినంత

ఎందు కొబ్బెరకోరు -- 1 కప్పు

!! చేసే విధానం !!

ష్టవ్ పై దట్టమైన గిన్నె వుంచి అందులో

బియ్యంపిండికి సమపాళ్ళల్లో నీళ్ళుపోసి

బాగా బుడగలు బుడగలుగా తెర్లిన నీళ్ళల్లో

బియ్యంపిండి,పెసరపప్పు,ఉప్పు,వాము,కొబ్బెరకోరు.

వేసి బాగా పిండిని కలయబెట్టి ఉంటలు

రాకుండగా చూసి దించేయాలి.

బాగా చల్లారిన తర్వాత బియ్యంపిండిని

పొడవుగా కడ్డీలుగా చేసి రౌండుగా చుట్టాలి.

మీకు ఎన్ని చుట్లు చుట్టాలనిపిస్తే అన్ని

చుట్టోచ్చు.కొందరు సున్నామాదిరిగా చుట్టి

అతికిస్తారు. మీకు ఏవిధంగ కావాలో చేసుకొని

వాటిని నూనె లో ఎర్రగా వేయించాలి .

కావలసిన వారు 2 పిడికిళ్ళు వేరుశనగలు

పిండి చేసి వేస్తే మరీ రుచి ఎక్కువ మరి మీరు
!! అనాస రసం !!


!! కావలసినది !!


అనాసపండు ముక్కలు 100 గ్రాం


కొత్తిమిర 2 టీస్పూన్స్


ఎండు మిరపకాయలు 3


వెల్లుల్లి రెబ్బలు 5


పచ్చిమిరపకాయలు 3


నూనె 3 టీ స్పూన్స్


ఆవాలు 1/4 టీ స్పూన్


జీలకర్ర 1/4 టీ స్పూన్


ధనియాల్ పొడి 2 టీ స్పూన్స్


టమోటాలు 3


పసుపు చిటికెడు


ఇంగువ చిటికెడు


ఉప్పు తగినంత

!! చేసేవిధానము !!



ముందుగా అనాస ముక్కలను సగం తీసుకొని ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి.


బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర,ఇంగువ


వేసి కాస్త వేగాక కరివేపాకు,తరిగిన టమోటా ముక్కలు, రుబ్బిన అనాస


ముద్ద వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి. తర్వాత మూడు కప్పుల నీరు పోసి


మరగనివ్వాలి.మరుగుతుండగా ఉప్పు,పసుపు,కొత్తిమిర,ధనియాల పొడి


మిగిలిన అనాస ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి.

!! కొత్తిమిర రసం !!

!! కావలసినది !!


కొత్తిమిర 1 కప్


పచ్చి శనగపప్పు 2 టీస్పూన్స్


జీలకర్ర 1/2 టీస్పూన్


టమోటాలు 2


వెల్లుల్లి రెబ్బలు 5


నూనె 3 టీస్పూన్స్


ఎండు మిరపకాయలు 4


పసుపు చిటికెడు


ఇంగువ చిటికెడు


ధనియాల పొడి


ఆవాలు 1/4 టీస్పూన్

!! చేసేవిధానము !!


బాణలిలో కొద్దిగా నూనె వేసి కొత్తిమిర ఆకులు,శనగపప్పు,ధనియాలు వేసి కొద్దిగా


వేపి చల్లారిన తర్వాత ముద్దగా రుబ్బుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు


ఎండుమిరపకాయలు,జీలకర్ర,ఇంగువ వేసి అవి వేగాక తరిగిన టొమాటోలు వేసి


మగ్గనివ్వాలి. రుబ్బిపెట్టుకున్న ముద్దలో కావల్సినంత నీరు పోసి కలిపి ఇందులో


పోసి మరగనివ్వాలి


!! అల్లంచారు !!

!! కావలసినవి !!

మీడియంసైజ్ అల్లం ముక్క


ధనియాలు 1 స్పూన్


జిలకర 1/2 స్పూన్


వెల్లుల్లి పాయలు 3


నిమ్మకాయ సైజు చింతపండు


ఉప్పు తగినంత


నీళ్ళు 3 గ్లాసులు


కర్వేపాకు


కొత్తిమిర కొద్దిగ

!! చేసేవిధానం !!

అల్లం ముక్క, ధనియాలు, జిలకర,


వెల్లుల్లి కలిపి ముద్దగానూరుకోవాలి.


నీళ్ళలో చింతపండు, ఉప్పు కలిపి


బాగా పిసకాలి.


ష్టవ్ పై చింతపండు నీళ్ళు వుంచి కర్వేపాకువేసి,


ఉప్పు వేసి నీళు మరుగుతున్నప్పుడు


అల్లం ముద్ద అందులో వేసి బాగా మరిగాక


కొత్తిమిర వేసి దించడమే .


కావాలంటే కొద్దిగ నూనెలో ఆవాలు జీర


ఎండు చిల్లి వేసి తాలింపు పెట్టుకోవచ్చు

!!!!! ఉలువ చారు !!!!!


ఉలువలు 3 పిడికిళ్ళు


జింజర్ కొద్దిగా


గార్లిక్ 4 పాయలు


ఉప్పు తగినంత


పసుపు చిటికెడు


నూనె ( తాలింపుకు )


ఆవాలు , జీరా , ఎండుమిర్చి.

!!!!! చేసే విధానము !!!!!

ఉలువలు ముందుగా దోరగా వేయించి నీళ్ళు ఎక్కువగా పోసి కుక్కర్ లో మెత్తగా వుడికించాలి .



వుడికిన వులవను గరిటతో మెత్తగా చేసుకొని వుంచవలెను . దట్టమైన గిన్నెలో కొద్దిగా నూనె



పోసి అందులో ఆవాలు , జీరా , ఎండుమిర్చి , కరేపాకు వేసి వేగిన తరువాత , కోరిన



జింజర్ ,సన్నగా తరిగిన వెల్లుల్లి పాయలు , వేసి దోరగా వేయించి అందులో వులువ పేష్ట్ వేసి



పసుపు , ఉప్పు , నీళ్ళు , తగినన్ని వేసి బాగా మరగ నీయండి చారు రెడి :)

నవరాత్రి స్పెషల్ ఐటమ్స్

నవరాత్రి స్పెషల్ ఐటమ్స్

!!! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం ( పరమాన్నం ) !!!

9వ రోజు ప్రసాదం

!! పరమాన్నం !!

!! కావలసినవి !!

చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్

శుఘర్ 1,1/2 కప్స్

ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్

ఎలక పౌడర్ 1/2 స్పూన్

గీ 5 టేబల్ స్పూన్స్

!! చేసే విధానం !!

ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త గీ వేసి

అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి

తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండి

అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచి

అందులో కాస్త గీ వేసి ఈ డ్రై ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .

చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి

ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి

( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )

అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా

ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి !!! మీ రడిగిన వరాలన్నీ ఆ పరమ్మాన్నం మైకంలో ఇచ్చేయటమే :)

!!! !!! మహిషాసుర మర్ధిని !!


8వ రోజు ప్రసాదం
!! బెల్లం అన్నం !!

!! కావలసినవి !!

బియ్యం 100 గ్రాం

బెల్లం 150 గ్రాం యాలకులు 5

నెయ్యి 50 గ్రాం

జీడిపప్పు 10

!! చేసే విధానం !!!

ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .

తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో తరిగిన బెల్లం వేసి

మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .

జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,

యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి

దించేయడమే .

తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :)


!! దుర్గాష్టమి !!

7th Day
!! కదంబం ప్రసాదం !!

!! కావలసినవి !!

కందిపప్పు 1/2 కప్

బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

1 వంకాయ

1/4 సొర్రకాయ

1 దోసకాయ

బీన్స్ తగినన్ని

1 పోటాటో

వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు

2 బేబీ కార్న్

1/2 క్యారెట్

2 టోమాటో

తగినంత కరేపాక్

కోత్తమీర

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

4 గ్రీన్ చిల్లిస్

నూనె తగినంత

నెయ్యి చిన్న కప్పు

చింతపండు గొజ్జు తగినంత

కాస్త బెల్లం ( జాగిరి )

ఉప్పు , పసుపు తగినంత

3 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

!!!! చేయవలసిన విధానము !!!!

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి

కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి

పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత

పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి

బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్ లో వేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసి

మరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి
కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి :)


!! శ్రీ మహాలక్ష్మిదేవి !!

6th Day
!! రవ కేసరి !!

!! కావలసినవి !!

రవ 1 కప్

షుఘర్ 3/4 కప్

గీ 2 టెబల్ స్పూన్

కేసరి కలర్ Tel Saffron టెల్ ఒక పించ్

యాలకులు 4

డ్రై ద్రాక్షా 6

జీడిపప్పు 10

మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )

వాటర్ 1/2 కప్

!!! చేసే విధానం !!!

ముందు మూకుడులో కాస్త గీ వేసి రవ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసి వుంచండి .

అదే మూకుడులో కాస్త గీ వేసి జీడిపప్పు , ద్రాక్ష వేయించి తీసి వుంచండి .

నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా బాయిల్ చేసి అందులో

కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి వుంటలు రాకుండగా గీ వేస్తూ బాగా కలిపి

అందులో ద్రాక్షా , జీడిపప్పు ,మిగిలిన గీ అంతా వేసి బాగా కలిపి

వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి ఆరగింపు పెట్టి

భోగ భాగ్యాలతో పాటు సౌభాగ్యం కూడా ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి

మీ కోరికలన్నీ నెరవేరినట్టే :) ఆ చల్లని తల్లి దీవెనల కన్నా మనకు కావలసినది ఏమి ?

!! సరస్వతి పూజ !!

5th Day

!! పెరుగన్నం , దద్ధోజనం !!

!! కావలసినవి !!

బియ్యం 1/4 కిలో

పాలు 1/2 లీ

చిక్కటి పెరుగు 1/2 లీ

నూనె 1/2 కప్పు

నెయ్యి 1 స్పూన్

కొత్తమిర , కరేపాక్

చిన్న అల్లం ముక్క

పచ్చిమిర్చి

పోపు సామాగ్రి

జీడిపప్పు 20

ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి

!! చేసే విధానం !!

ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక

కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి

సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని

ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి

ఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి

కాస్త నేతిలో జీడిపప్పులు వేయించి అవీ వేయండి

రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ

ఎందుకో తింటే మీకే తెలుస్తుంది ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ :)


!! లలితా దేవి !!

4th Day
!! అల్లం గారెలు !!

!! కావలసినవి !!

మినపప్పు2 కప్స్

అల్లం స్మాల్ పీస్

గ్రీన్ చిల్లీ 6 సన్నగా తరిగి పెట్టండి

జీరా 1/4 స్పూన్

ఉప్పు రుచికి తగినంత

కరేపాక్ , కోత్తమిర తగినంత

నూనె గారెలు వేయించేందుకు

!!! చేసే విధానం !!!

మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .

నానిన మినపప్పును గ్రైండర్లో వేసి అందులోనే అల్లం . గ్రీన్ చిల్లి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో

కరేపాక్ , కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .

దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ లలితాదేవిని ఆరాధించి నైవేద్యం పెట్టి చల్లగా కాపాడు తల్లీ అని వేడుకొని మనం

ఆరగించటమే :)!!!!!

!! అన్నపూర్ణా దేవి !!
3rd Day
!! కొబ్బెరన్నం !!

!! కావలసినవి !!

బియ్యం 1/2 కిలో

తురిమిన పచ్చికొబ్బెర 1 కప్

పచ్చిమిర్చి 5

కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .

పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .

జీడి పప్పు 10

నూనె , 1/4 కప్

నెయ్యి 1 టెబల్ స్పూన్

!! చేయవలసిన పద్ధతి !!

అన్నం పోడి పోడి గా వండుకొని

పచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి

ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .

అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి

ఎండుమిర్చి , ఇంగువ , వేసి

ఆవాలు చిటపట చిటపట అనగానే

పొడవుగా తరిగిన గ్రీన్ చిల్లీ , కరేపాక్ , కోత్తమిర ,

అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి

ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .

కడుపునింపే అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి

మన కడుపు చల్లగా చూడమని వేడుకొనటమే మనం చేయవలసిన పని

కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత తెలిసినదే కదా )

ఆ తల్లి దీవెనలు వుంటే అడివిలో నైనా పిడికెడు అన్నం దొరక్కపోదు :)


!! గాయత్రి దేవి !!
2nd Day
!! పులిహోర !!

!! కావలసినవి !!

బియ్యం 150 గాం

చింతపండు 50 గ్రాం

పసుపు1/2 స్పూన్

ఎండుమిర్చి 5

ఆవాలు 1/2 స్పూన్

మినపప్పు 1 స్పూన్

శనగ పప్పు 2 స్పూన్

వేరు శనగ పప్పు 1/2 కప్పు

కరివేపాకు 2 రెబ్బలు

ఇంగువ చిటికెడు

నూనె 1/4 కప్పు

ఉప్పు తగినంత

బెల్లం కొద్దిగా

!! చేయవలసిన విధానం !!

అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .

చింతపండును అరకప్పు నీళ్ళు పోసి

నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి,

మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి

కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి ( కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చు గొజ్జిలో )

వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి .

బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత

వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే జగదేక మాతైన ఆ గాయిత్రి దేవికి

నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము

!! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !!
1st Day

!! పొంగల్ !!

!! కావలసినవి !!

పెసరపప్పు 150 గ్రాం

కొత్త బియ్యం 100 గ్రాం

బ్లాక్ పెప్పర్ 15

గ్రీన్ చిల్లి 6

పచ్చి కొబ్బెర 1 కప్

కాచిన నెయ్యి 1/4 కప్

జీడిపప్పు cashewnuts 15

జీర 1/2 టేబల్ స్పూన్

ఆవాలు 1/4 టేబల్ స్పూన్

ఎండుమిర్చి 3

మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్

కోత్తమిర , కరేపాకు , తగినంత

ఉప్పు రుచిని బట్టి

ఇంగువ 2 pinches

!! చేయవలసిన విధానము !!

దళసరి wokలో కాస్త నేయి వేడి చేసి

పెసరపప్పుని దోరగా ఏయించండి .

బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన

తరువాత బియ్యంకూడా బాగా వేయించండి

తెలుపు రంగు పోకూడదు సుమా 5 minutes

వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మారకూడదు

అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి

జీడిపప్పులను వేయించి పెట్టడి.

సన్నగా తరిగిన చిల్లి ,

పచ్చికొబ్బెర కోరు

పెప్పర్ , జిలకర వేయించిన బియ్యం

పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో

కుక్కర్లో వుంచి 3 whistlesవచ్చాక

ష్టవ్ off చేయండి.

చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,

శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,

ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టి

మిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసి

వేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి

భక్తిగా పూజించి

దసరా 10 రోజులు మాకు శక్తి

నిచ్చి మాచే పూజలందుకొనుమా

మా కోరికలు తీర్చుమా

అని ప్రాథించాలి :)


ఎగ్ నూడిల్స్ అంటే రిబ్బన్‌లా వుండేది


ఎగ్ నూడిల్స్ అంటే రిబ్బన్‌లా వుండేది
!! Singapore Style Noodels !!

!! కావలసినవి !!

ఎగ్ నూడిల్స్ -- 300గ్రా
( ఉడికించి వడకట్టాలి
..పాకేట్‌పై సూచనలు పాటించాలి)


బీన్స్,క్యారెట్, గ్రీన్‌పీస్,కార్న్ -- 75 గ్రా

నూనె -- 2 టేబల్ స్పూన్స్

ఉల్లిపాయ -- 1

వెల్లుల్లి ముక్కలు -- 1 స్పూన్

సోయా సాస్ -- 3 స్పూన్స్

చిల్లీ సాస్ -- 2 స్పూన్స్

పంచదార -- 1 స్పూన్

పాలకూర -- 50 గ్రా

ఉల్లికాడలు -- 4

పాక్‌చోయ్ ఆకులు (pak choy)తరిగినది

రైస్ వెనీగర్ -- 1 స్పూన్

గుడ్డు (egg) -- 2

తగినంత ఉప్పు

!! చేసే విధానం !!

మూకుడులో 1 స్పూన్ నుఊనె వేసి వేడి చేసి,
గిలకొట్టిన ఎగ్స్ వేసి దీనిని ఒక ధిక్ షీటుపైన పరచాలి.

దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఓ పక్కన వుంచుకోవాలి.

మూకుడులో నూనె వేడి చేసి ఒక నిముషం పాటు వెల్లుల్లి వేయించాలి.

తరిగిన ఉల్లిపాయముక్కలువేసి మరో నిముషం వేయించాలి.

బీన్స్,క్యారేట్, గ్రీన్‌పీస్,కార్న్. వేసి వుడికించాలి.

(నాన్వెజి వాళ్ళు ఇక్కడ చికెన్,రొయ్యలు,వేసుకోవచ్చు
ఐ మీన్ ఉడికించుకోవచ్చు )


సోయాసాస్,వెనీగర్,చిల్లీసాస్,పంచదార కలపాలి.

3 నిముషాలు సన్నటి సెగపై వుంచి,

పాలకూర,పాక్చోయ్,ఉప్పు,ఉల్లికాడలు,వేసి నీడిల్స్ కలిపి

రెండు మూడు నిముషాలు ఉడికించాలి.

ఎగ్ ముక్కల్ని కలియబెట్టాలి.

సింగపూర్ స్టయిల్ నూడిల్స్ తయార్..... :)


!! తులసి ఆకుతో రైస్ నూడిల్స్ !!

!! కావలసినవి !!

రైస్ నూడిల్స్ --300 గ్రా
(వేడినీటిలో మెత్తబడేంతవరకు నానబెట్టాలి )

తులసీ ఆకులు -- 12 లెక 15 .

వెల్లుల్లి ముక్కలు -- 1 స్పూన్

పచ్చి మెరపకాయలు తరిగినవి -- 2

రెడ్ కర్రీ పేష్ట్ -- 1 స్పూన్

నూనే --21/2 స్పూన్స్

బీన్స్ మొలకలు -- 100 గ్రా

లైట్ సోయాసాస్ -- 2 స్పూన్స్

ఆనియన్ కాడలు---4

తగినంత ఉప్పు

టోమాటొ --1

!! తయారుచేసే విధం !!

మూకుడులో నూనె వేడి చేసి వెల్లుల్లి,ఉల్లిపాయ ముక్కలు వేసి
2 నిముషాలు వేయించాలి.

టోమాటో,రెడ్ కర్రీ పేష్ట్,అందిలోనే కలపాలి.

అప్పుడప్పుడు కలియపెడుతూ నూడిల్స్ వేయాలి.

2,3, స్పూన్లు నీటిని సోయాసాసుతో పాటుగా కలిపి వేయాలి.

కాసేపు వుడికించాక బీన్స్ మొలకలు,ఉప్పు,తులసీ ఆకులు అందులో కలిపి,
ఉల్లికాడలతో అలంకరించి వేడిగా వడ్డించడమే.

కావాలంటే కోత్తమిర ( Koriander Leaf)సన్నగా తరిగి వేసుకోవచ్చు :)

!! ధాయ్ బ్రాడ్ నూడిల్స్ !!

!! కావలసినవి !!

బ్రాడ్ రైస్ స్టిక్స్ నూడిల్స్ -- 400 గ్రా

డార్క్ సోయాసాస్ -- 1 స్పూన్

వెల్లుల్లి ముక్కలు -- 1 స్పూన్

ఎండు మెరపకాయలు -- 2

నూనే -- 21/2 స్పూన్స్

పంచదార -- 1/2 స్పూన్

లైట్ సోయాసాస్ -- 11/2 స్పూన్స్

పాలకూర -- 100గ్రా

వెజిటబుల్ స్టాక్ -- 4 స్పూన్స్

Mushrooms 6 తరిగినవి ( కావాలంటే వేసుకోవచ్చు
లేకుంటే లేదు )

ఆనియన్ కాడలు---4

తగినంత ఉప్పు

!! తయారుచేసే విధం !!

కనీసం రెండు గంటలపాటు నూడిల్స్
మెత్తబడేవరకు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి.

నీటిని ఒంపేసి,డార్క్ సోయాసాస్ కలపాలి.
( పైన గుండ్రాంగా జల్లితే నూడిల్స్ కి సాసు బాగా అంటుకొంటుంది)

మూకుడులో నూనె వేడి చేసి వెల్లుల్లి,ఎండుమిర్చి వేసి
కాసేపు వేయించి, పుట్టగొడుగు ముక్కలు (Mushrooms)కలపాలి.
వుడికేదాకా వేయించాలి.

సన్నగ తరిగిన పాలకూరవేసి కలియబెట్టాలి.

ఒక నిముషం తరువాత నూడిల్స్,లైట్ సోయాసాస్,పంచదార,
ఉప్పు,వెజిటబుల్ స్టాక్ కలిపి,నూడుల్స్ మెత్తపడ్డక
పైన ఆనియన్ కాడలు సన్నగా తరిగి,
నూడిల్స్ పై చుట్టుతా చల్లి,వేడిగా వడ్డించాలి.

( కావాలంటే 4 బ్రెడ్ ముక్కలు రోష్ట్ చేసి సన్న ముక్కలు చేసి ఇందులో వేసుకోవచ్చు.)

!! మాంగో జామ్ !!
!! కావలసినవి !!

మామిడిపండ్ల ముక్కలు -- 1/2 కిలో

నిమ్మరసం లేదా సిట్రిక్ ఆసిడ్ -- 1/2 స్పూన్

నీరు -- 1 కప్పు

పంచదార -- 1 కప్పు

!! చేసే పద్ధతి !!

మామిడిపళ్ళు పైపెచ్చు తీసి,చిన్న చిన్న ముక్కలు తరిగి

నీరుపోసి బాగా మెత్తగా వుడికించాలి.

పంచదార ముక్కల్లో వేసి కలిసేంతవరకు గరిటతో కలియబెట్టాలి.

సిట్రిక్ ఆసిడ్ లేదా నిమ్మరసం కూడా జామ్ లో కలిపి మాంచి సెగమీద ఉడకనివ్వాలి.

ఉడికిన జామ్ దించి పొడిగా వున్న గాజుసీసాలో పోసుకొని జాం చేసిన రెండో

రోజు నుంచి ఉపయోగించుకోవచ్చు
.
!! క్యాప్సికం మసాల !!

!! కావలసినవి !!

క్యాప్సికం - 2

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 5

కారం - 1 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

నువ్వులు - 1/4 cup

వేరుశనగుళ్ళు - 1/2 cup

కొబ్బరి - 1/2 cup (పొడి)

ఆవాలు - 1/4 tbl spoon

మెంతులు -చిటికెడు

చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)

ఉప్పు -తగినంత

నునె - 3 tbl spoons

కొత్తిమెర

!!! తయారు చేసే విధానం !!!

1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు,కొబ్బరి వేసి
వేయించి దానిని మంట మీద నుంచి దింపి చల్లారబెట్టాలి.

2.ఇప్పుడు దానిని గ్రైండ్ చేసుకోవాలి (కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి).

3.పాన్ లో నునె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి.

4.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

5.అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి.

6.అది కొంచెం వేయించాక దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్నవేరుశనగుళ్ళుముద్దనీ
వేసి వేయించుకొవాలి.

7.అందులో కారం,ఉప్పు వేసి వేయించాలి.

8.ఇప్పుడు నానబెట్టి వుంచుకున్న చింతపండు పులుసు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి.

9.అలా కొంచెం గట్టిపడేక మంట మీద నుంచి దింపేముందు కొత్తిమెర వేయ్యాలి.

!!! ఫన్నీర్ మసాల !!!

!! కావలసినవి !!

పన్నీర్ 200 గ్రా ,

ఉల్లిపాయలు 50 గ్రా ,

జిలకర 25 గ్రా ,

ఎండుమెరపకాయలు 4 ,

ధనియాలు పొడి 3 టీ స్పూన్స్ ,

గరం మసాల 5 గ్రా ,అల్లం 25 గ్రా ,

వెల్లుల్లి 20 గ్రా ,

పచ్చిపాలకోవా 50 గ్రా ,

టోమాటో 150 గ్రా ,

రిపైండ్ ఆయిల్ 75 గ్రా ,

కోత్తమిర 1 కట్ట ,

పసుపు చిటికెడ్ద్ .

ఉప్పు తగినంత .

చేసే విధానం !!!

ఒక బాండి లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో 10 గ్రాముల జిలకర , సన్నగ

తరిగిన ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి ముల్లలు వేసి వేయించండి . ఇవన్నీ కాస్త వేగిన

తరువాత , పొడవుగా కోసిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసి వేయించాలి . ఈ మిశ్రమం అంతా

వేగుతున్నప్పుడే పొడిచేసిన జిలకర్ర , ఎండుమిరపకాయలు , ధనియాలు , గరం మసాల ,

పసుపు , కూడా వేసి రెండు నిముషాలు వేయించి పచ్చికోవాను చేర్చి వుడికించండి . దాంట్లో

సిధంగా వుంచుకొన్న టోమాటోలను రసం పిండి , ఆ తర్వాత వాటిని ముక్కలుగా కోసి ,

ఉడుకుతున్న కూరలో కలిపి , ఉప్పు వేసి , మరో ఐదు నిముషాలు వుడికిన తరువాత బాణలిని

స్టౌ మీదనుంచి దిపండి . కోత్తమీర కలిపిన ఈ కూర చపాతికి పలావ్ కి చాలా బావుంటుంది. :)